India-New Zealand 1st Test: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్

ABN , First Publish Date - 2021-11-25T15:52:54+05:30 IST

కాన్పూర్ వేదికగా భారత్ -న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనున్న తొలి టెస్ట్‎లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ మ్యాచ్ ఓటమి తర్వాత కివీస్‎తో భారత్ జట్టు

India-New Zealand 1st Test: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్

కాన్పూర్: కాన్పూర్ వేదికగా భారత్ -న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనున్న తొలి టెస్ట్‎లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ మ్యాచ్ ఓటమి తర్వాత కివీస్‎తో భారత్ జట్టు తలపడుతోంది. న్యూజిలాండ్ పై టెస్టు సిరీస్ కైవసం చేసుకోని ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా భావిస్తోంది. అంతేకాకుండా టీ20 సిరీస్‎లో పరాభవాన్ని చవిచూసిన కివీస్ జట్టు తొలి టెస్టులో గెలిచి సిరీస్‎పై పట్టు సాధించాలని ఆసక్తిగా ఎదురుచూస్తోంది.


అయితే.. ఈ టెస్టు సిరీస్‎లో సీనియర్లు ఎవరు లేకపోవడంతో టీమిండియా కొంచెం ఒత్తిడికి గురవుతుంది. తొలి టెస్టులో శ్రేయాస్ అయ్యర్‌ అరంగేట్రం ఖరారైంది. కోహ్లీ, రోహిత్‌ శర్మ, రిషభ్‌ పంత్‌ గైర్హాజరీలో టీమిండియా బ్యాటింగ్‌ కొంత బలహీనంగా కనిపిస్తోంది. రహానె, పుజార, మయాంక్‌ అగర్వాల్‌కు మాత్రమే 10 టెస్టులకు పైగా ఆడిన అనుభవం ఉంది. 


భారత జట్టు: శుభ్‌మన్ గిల్, మయాంక్ అగర్వాల్, చెతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే(కెప్టెన్‌) శ్రేయాస్ అయ్యర్, వృద్ధిమాన్ సాహా(వికెట్‌ కీపర్‌), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్


న్యూజిలాండ్‌ జట్టు:  టామ్‌ లాథమ్, విల్ యంగ్, కేన్ విలియమ్సన్(కెప్టెన్‌), రాస్ టేలర్, హెన్రీ నికోల్స్, టామ్ బ్లండెల్(వికెట్‌ కీపర్‌), రచిన్ రవీంద్ర, టిమ్ సౌథీ, అజాజ్ పటేల్, కైల్ జామీసన్, విలియం సోమర్‌విల్లే

Updated Date - 2021-11-25T15:52:54+05:30 IST