Abn logo
Sep 26 2021 @ 08:09AM

Kuwait వదిలి వెళ్లిన వారిలో భారతీయులే టాప్.. ఆరు నెలల్లోనే ఎంతమంది వచ్చేశారంటే..

కువైత్ సిటీ: కువైటైజేషన్ పాలసీకి తోడుగా కరోనా కూడా చేరడంతో గడిచిన ఏడాది కాలంగా భారీ సంఖ్యలో ప్రవాసులు కువైత్ వదిలి వెళ్లిపోతున్నారు. కువైత్ లేబర్ మార్కెట్ గడిచిన ఏడాది కాలంలోనే ఏకంగా సుమారు 2లక్షల మంది ప్రవాస కార్మికులను కోల్పోయినట్లు తాజా సమాచారం. 2020 మార్చి నుంచి 2021 మార్చి వరకు 15 రంగాల్లో లక్ష 99వేల మంది ప్రవాసులు కువైత్ వదిలి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇలా కువైత్ నుంచి స్వదేశాలకు వెళ్లిన వారిలో భారతీయ కార్మికులే అధికం. ఈ ఏడాది మొదటి అర్ధభాగం వరకు ఏకంగా 21,341 మంది భారత ప్రవాసులు కువైత్‌కు గుడ్‌బై చెప్పారు. 

భారత్ తర్వాత ఈజిప్ట్11,135 మంది కార్మికులతో రెండో స్థానంలో ఉంటే.. బంగ్లాదేశ్ 6,136 మందిలో మూడో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత వరుసగా నేపాల్(4,185), ఫిలిప్పీన్స్(1,953), పాకిస్తాన్(1,250), సిరియా(253), జోర్డాన్(236), ఇరాన్(210) ఉన్నాయి. అలాగే ఇతర దేశాలకు చెందిన 4,268 మంది ప్రవాసులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇది కేవలం ప్రైవేట్ కంపెనీలకు సంబంధించన డేటా మాత్రమే. అటు గృహాకార్మికుల కేటగిరీలోనూ భారత ప్రవాసులే అత్యధికంగా కువైత్‌ను వదిలి వెళ్లినట్లు తెలుస్తోంది.


ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో 10,169 మంది భారత కార్మికులు కువైత్ నుంచి స్వదేశానికి వచ్చేశారు. ఆ తర్వాత ఫిలిప్పీన్స్‌కు చెందిన వారు 2,543 మంది డొమెస్టిక్ వర్కర్లు కువైత్ వదిలి వెళ్లారు. ఆ తర్వాత స్థానాల్లో వరుసగా బంగ్లాదేశ్(773), నేపాల్(664), ఈథోపియా(177), ఇండోనేషియా(22) ఉన్నాయి. అలాగే ఇతర దేశాలకు చెందిన వారు సుమారు 950 మంది ఉన్నారు. ఇలా 2021 మొదటి అర్ధభాగంలో కేవలం డొమెస్టిక్ కేటగిరీనే 17,398 మంది ప్రవాస కార్మికులను కోల్పోయింది.     

ఇవి కూడా చదవండిImage Caption

తాజా వార్తలుమరిన్ని...