న్యూఇయర్ సెలవుల్లో Kuwait ఎయిర్‌పోర్టు నుంచి 1.82లక్షల మంది ప్రయాణం.. టాప్‌లో భారత్!

ABN , First Publish Date - 2022-01-04T14:00:25+05:30 IST

న్యూఇయర్ హాలీడేస్ అయినా డిసెంబర్ 24 నుంచి 31వ తేదీ మధ్య వారం రోజుల వ్యవధిలో కువైత్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఏకంగా 1,82,400 మంది ప్రయాణికులు రాకపోకలు కొనసాగించారు.

న్యూఇయర్ సెలవుల్లో Kuwait ఎయిర్‌పోర్టు నుంచి 1.82లక్షల మంది ప్రయాణం.. టాప్‌లో భారత్!

కువైత్ సిటీ: న్యూఇయర్ హాలీడేస్ అయినా డిసెంబర్ 24 నుంచి 31వ తేదీ మధ్య వారం రోజుల వ్యవధిలో కువైత్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఏకంగా 1,82,400 మంది ప్రయాణికులు రాకపోకలు కొనసాగించారు. వీరిలో లక్ష మంది వరకు కువైత్ నుంచి బయటకు వెళ్తే.. 82వేల మంది బయటి దేశాల నుంచి కువైత్‌కు వచ్చారు. ఈ ఏడు రోజుల్లో కువైత్ ఎయిర్ పోర్టు నుంచి 40 విమానయాన సంస్థలకు చెందిన 1,670 విమాన సర్వీసులు 34 దేశాలకు రాకపోకలు కొనసాగించాయి. కాగా, దేశాలవారీగా చూసుకుంటే మాత్రం భారత్ 34వేల మంది ప్రయాణికులతో టాప్‌లో నిలిచింది. 292 విమానాల్లో ఇండియన్ ప్రయాణికులు ప్రయాణించారు. వీరిలో 18,970 మంది కువైత్ నుంచి బయటకు వెళ్తే.. 15,360 మంది భారత్ నుంచి కువైత్ చేరుకున్నారు. భారత్ తర్వాతి స్థానంలో ఈజిప్ట్ ఉంది. 193 విమానాల్లో 26,800 మంది రాకపోకలు కొనసాగించారు. ఈజిప్ట్ తర్వాతి స్థానాల్లో వరుసగా సౌదీ అరేబియా(24,400), యూఏఈ(20,400), టర్కీ(17,390) నిలిచాయి.                      

Updated Date - 2022-01-04T14:00:25+05:30 IST