Tokyo Paralympics: భారత షూటర్ అవని ఎయిర్ రైఫిల్ పోటీల్లో ఫైనల్‌కు...

ABN , First Publish Date - 2021-08-30T13:26:26+05:30 IST

ప్రస్తుతం జరుగుతున్న టోక్యో పారాలింపిక్స్‌లో భారత షూటర్ అవని లేఖారా మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ పోటీల్లో ఫైనల్లోకి ప్రవేశించింది....

Tokyo Paralympics: భారత షూటర్ అవని ఎయిర్ రైఫిల్ పోటీల్లో ఫైనల్‌కు...

టోక్యో (జపాన్): ప్రస్తుతం జరుగుతున్న టోక్యో పారాలింపిక్స్‌లో భారత షూటర్ అవని లేఖారా మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ పోటీల్లో ఫైనల్లోకి ప్రవేశించింది. సోమవారం జరిగిన పోటీలో అవని ఫైనల్ కు చేరింది. తుది రౌండ్ క్వాలిఫికేషన్‌లో 104.1 స్కోర్ చేయడానికి ముందు ఆటలో ఆమె తన మూడవ,నాల్గవ ప్రయత్నంలో 104.9, 104.8 స్కోర్లను నమోదు చేసింది. పారా రైఫిల్ షూటర్ అయిన అవని 2001 నవంబరు 8వతేదీన జన్మించారు. ప్రపంచంలో మహిళల ఎయిర్ రైఫిల్ షూటర్లలో అవని 5వస్థానంలో నిలిచింది. భారతదేశ పారా టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి భవీనాబెన్ రజత పతకం గెలిచింది.భారతదేశంలో పారాలింపిక్స్‌లో పతకం సాధించిన మొదటి టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి దీపా మాలిక్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండవ మహిళా అథ్లెట్‌గా భవీనాబెన్ పటేల్ నిలిచింది.

Updated Date - 2021-08-30T13:26:26+05:30 IST