విమానం టిక్కెట్ ధర చూసి విస్తుపోయిన ఐఏఎస్! డీజీసీఏకు ఫిర్యాదు

ABN , First Publish Date - 2021-08-09T22:19:48+05:30 IST

ఆయనో ఐఏఎస్.. పేరు సంజీవ్ గుప్తా. కేంద్ర హోం శాఖలో పనిచేస్తున్నారు. ఇంతటి కీలకస్థానంలో ఉన్న అధికారికి విమాన ప్రయాణాలు సర్వసాధారణమైన విషయం. కానీ.. బ్రిటీష్ ఎయిర్ వేస్ సంస్థ పేర్కొన్న విమాన టిక్కెట్ ధర చూసి ఆయన కూడా విస్తుపోయారు.

విమానం టిక్కెట్ ధర చూసి విస్తుపోయిన ఐఏఎస్! డీజీసీఏకు ఫిర్యాదు

న్యూఢిల్లీ: ఆయనో ఐఏఎస్.. పేరు సంజీవ్ గుప్తా. కేంద్ర హోం శాఖలో పనిచేస్తున్నారు. ఇంతటి కీలకస్థానంలో ఉన్న అధికారికి విమాన ప్రయాణం సర్వసాధారణమైన విషయం. కానీ.. బ్రిటీష్ ఎయిర్ వేస్ సంస్థ పేర్కొన్న విమాన టిక్కెట్ ధర చూసి ఆయన కూడా విస్తుపోయారు. ఆగస్టు 26న ఢిల్లీ నుంచి లండన్ వెళ్లబోయే విమానంలో ఎకానమీ క్లాస్ టిక్కెట్టు ధర రూ. 3.95 లక్షలని బ్రిటీష్ ఎయిర్ వేస్ పేర్కొనడంతో సంజయ్ గుప్తా అవాక్కైపోయారు. శనివారం ట్విటర్ వేదికగా ఆయన తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇదే ప్రయాణానికి విస్తారా ఎయిర్‌లైన్స్ రూ.1.2 లక్షలు, ఎయిర్ ఇండియా రూ. 2.3 లక్షలు చార్జ్ చేస్తోందని తెలిపారు. ఈ విషయాన్ని పౌరవిమానయాన డైరెక్టరేట్ జనరల్(డీజీసీఏ) దృష్టికి తీసుకెళ్లానని పేర్కొన్నారు. కాగా.. దీనిపై డీజీసీఏ తాజాగా స్పందించింది..ఢిల్లీ-లండన్ విమాన ప్రయాణాల టిక్కెట్ ధరలపై పూర్తి వివరాలు వెల్లడించాలంటూ బ్రిటీష్ ఎయిర్‌వేస్‌ను కోరామని డీజీసీఏ పేర్కొంది. కాగా.. బ్రిటన్‌లో కాలేజీ అడ్మిషన్లు ప్రారంభమైన నేపథ్యంలో విమాన టెక్కట్ల ధరలు కొంతమేర పెరిగి ఉండొచ్చని కూడా సంజయ్ గుప్తా తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 

Updated Date - 2021-08-09T22:19:48+05:30 IST