ఇండిగోకు కరోనా కడగండ్లు!

ABN , First Publish Date - 2020-07-30T06:10:56+05:30 IST

కరోనా విజృంభణతో విమానయాన సేవలు స్తంభించిపోయాయి. దాంతో ఎయిర్‌లైన్స్‌కు భారీగా గండిపడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జూన్‌ తో ముగిసిన తొలి త్రైమాసికానికి (క్యూ1) ఇండిగో....

ఇండిగోకు కరోనా కడగండ్లు!

క్యూ1లో రూ.2,844 కోట్ల నష్టం


ముంబై: కరోనా విజృంభణతో విమానయాన సేవలు స్తంభించిపోయాయి. దాంతో ఎయిర్‌లైన్స్‌కు భారీగా గండిపడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జూన్‌ తో ముగిసిన తొలి త్రైమాసికానికి (క్యూ1) ఇండిగో ఎయిర్‌లైన్‌ మాతృ సంస్థ ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ ఏకంగా రూ.2,844.3 కోట్ల నష్టాన్ని చవిచూసింది. ఈ ఏప్రిల్‌-జూన్‌ కాలానికి కంపెనీ మొత్తం ఆదాయం సైతం 88 శాతం క్షీణించి రూ.1,143.8 కోట్లకు పరిమితమైంది. విమాన సర్వీసుల కార్యకలాపాల ద్వారా ఆర్జన ఏకంగా 91.9 శాతం తగ్గి రూ.766.7 కోట్లకు పడిపోయింది. 


స్పైస్‌జెట్‌ నష్టం రూ.807 కోట్లు: గత ఆర్థిక సంవత్సరం (2019-20)లో చివరి త్రైమాసికాని (జనవరి-మార్చి)కి స్పైస్‌జెట్‌ రూ.807.10 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. ఆదాయం మాత్రం రూ.3,057.3 కోట్లకు పెరిగింది. 2019 -20 మొత్తానికి ఈ ఎయిర్‌లైన్స్‌ నష్టం రూ.934.8 కోట్లుగా నమోదైంది. రాబడి రూ.13,206 కోట్లకు చేరుకుంది. 

Updated Date - 2020-07-30T06:10:56+05:30 IST