ఇందిరమ్మ ఇళ్ల సామగ్రి వృథా

ABN , First Publish Date - 2021-04-14T06:29:47+05:30 IST

దివంగత ముఖ్యమంత్రి వైఎ్‌స రాజశేఖరరెడ్డి హయాంలో ప్రభు త్వం పేదలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని తలపెట్టింది.

ఇందిరమ్మ ఇళ్ల సామగ్రి వృథా
ఎంపీడీవో కార్యాలయం ఆవరణంలో వృథాగా ఉన్న సిమెంటు చౌకట్లు

ఆళ్లగడ్డ, ఏప్రిల్‌ 13: దివంగత ముఖ్యమంత్రి వైఎ్‌స రాజశేఖరరెడ్డి హయాంలో ప్రభు త్వం పేదలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని   తలపెట్టింది. వాటికి అవసరమైన   కిటికిలు, చౌకట్లు తయారు చేసేందుకు ఆళ్లగడ్డ, చాగలమర్రి మండల కేంద్రాలలో నిర్మిత కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో తయారైన సామగ్రిని లబ్ధిదారులకు చెల్లించె బిల్లుల్లో కోత విధించి గృహ నిర్మాణ శాఖ అధికారులు సరఫరా చేసేవారు. ఇలా తయారైన సామగ్రి నాణ్యంగా లేదని లబ్ధిదారులు వీటి పట్ల విముఖత చూపించారు. దీంతో కిటికిలు, చౌకట్లు వృథాగా చెట్ల కింద ఉండిపోయాయి. వీటితో పాటు వేలాది సిమెంటు బస్తాలు గడ్డ కట్టి పనికి రాకుండా పోయాయి. ఇలా  లక్షలాది రూపాయల ప్రజాధనం వృథా అయింది. ఇవి తయారయ్యేటప్పుడే వీటిని పనికి రాని వాటిగా  గుర్తించామని గృహ నిర్మాణ డీఈ నరసింహారావు తెలిపారు. 

Updated Date - 2021-04-14T06:29:47+05:30 IST