పరోక్ష పన్ను వసూళ్లు రూ.10.71 లక్షల కోట్లు

ABN , First Publish Date - 2021-04-14T06:19:37+05:30 IST

పరోక్ష పన్నుల నిక రాదాయం గడిచిన ఆర్థిక సంవత్సరానికి రూ.10.71 లక్షల కోటు గా నమోదైంది. 2019-20లో వసూలైన రూ.9.54 లక్షల కోట్లతో పోలిస్తే ఇది 12.3 శాతం అధికం

పరోక్ష పన్ను వసూళ్లు రూ.10.71 లక్షల కోట్లు

2020-21లో 12.3 శాతం వృద్ధి నమోదు 


న్యూఢిల్లీ: పరోక్ష పన్నుల నిక రాదాయం గడిచిన ఆర్థిక సంవత్సరానికి రూ.10.71 లక్షల కోటు గా నమోదైంది. 2019-20లో వసూలైన రూ.9.54 లక్షల కోట్లతో పోలిస్తే ఇది 12.3 శాతం అధికం. సవరించిన బడ్జెట్‌ (2020-21) అంచనా రూ.9.89 లక్షల కోట్లతో పోల్చినా 8.2 శాతం అధికమని సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండైరెక్ట్‌ ట్యాక్సెస్‌ అండ్‌ కస్టమ్స్‌ (సీబీఐసీ) చైర్మన్‌ ఎం అజిత్‌ కుమార్‌ తెలిపారు. వస్తు, సేవల పన్ను   (జీఎ్‌సటీ), కస్టమ్స్‌, ఎక్సైజ్‌ సుంకం పరోక్ష పన్నుల పరిధిలోకి వస్తాయి. గతసారి జీఎ్‌సటీ, కస్టమ్స్‌, ఎక్సైజ్‌ సుంకంతోపాటు సేవా పన్ను పాత బకాయిల నికర వసూళ్లు రూ.10.71 లక్షల కోట్లకు చేరుకున్నట్లు అజిత్‌ కుమార్‌ స్పష్టం చేశారు. 


కరోనా దెబ్బకు ఆర్థిక వ్యవస్థ కుదేలవడంతో ఆర్థిక శాఖ గత బడ్జెట్‌ ఆదాయ అంచనాలను తగ్గించుకుంది. జీఎ్‌సటీ ఆదాయం అంచనాను రూ.5.15 లక్షల కోట్లకు కుదించుకుంది. వసూళ్లు మాత్రం అంచనాలను మించాయి. జీఎస్‌టీతోపాటు ఇతర విభాగాల్లోనూ పన్ను ఆదాయం అంచనాలకు మించి నమోదైంది. వైరస్‌ వ్యాప్తి, లాక్‌డౌన్‌ ప్రభావంతో గత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో (ఏప్రిల్‌-సెప్టెంబరు) జీఎ్‌సటీ వసూళ్లకు భారీగా గండిపడింది. ద్వితీయార్ధంలో మాత్రం వేగంగా పుంజుకున్నాయి. మార్చితో వరకు వరుసగా ఆరు నెలల పాటు జీఎ్‌సటీ స్థూల వసూళ్లు రూ.లక్ష కోట్ల మైలురాయిని దాటాయి. మార్చిలో స్థూల వసూళ్లు ఆల్‌టైం రికార్డు స్థాయి రూ.1.24 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ప్రస్తుత జోరును బట్టి చూస్తే, వచ్చే ఆర్థిక సంవత్సరం(2021-22)లో పరోక్ష పన్ను వసూళ్లు బడ్జెట్‌ అంచనాలను సులభంగా చేరుకోగలవని సీబీఐసీ చైర్మన్‌ అభిప్రాయపడ్డారు. 


విభాగాల వారీగా నికర పన్ను వసూళ్లు 

విభాగం    2020-21(రూ.లక్షల కోట్లు)   2019-20(రూ.లక్షల కోట్లు)   వృద్ధి/(క్షీణత) శాతం

జీఎ్‌సటీ      5.48                   5.99                        (8.0) 

కస్టమ్స్‌ సుంకం 1.32                   1.09                        21.0

ఎక్సైజ్‌ సుంకం, సేవా పన్ను  3.91           2.45                         59.2

పాతబకాయిలు

Updated Date - 2021-04-14T06:19:37+05:30 IST