ఇండోనేషియా ఫ్లోర్స్ ద్వీపంలో భారీ భూకంపం...issues tsunami warning

ABN , First Publish Date - 2021-12-14T15:37:53+05:30 IST

ఇండోనేషియా ఫ్లోర్స్ ద్వీపం సమీపంలోని సముద్ర ప్రాంతంలో మంగళవారం శక్తివంతమైన భూకంపం సంభవించింది...

ఇండోనేషియా ఫ్లోర్స్ ద్వీపంలో భారీ భూకంపం...issues tsunami warning

జకార్తా: ఇండోనేషియా ఫ్లోర్స్ ద్వీపం సమీపంలోని సముద్ర ప్రాంతంలో మంగళవారం శక్తివంతమైన భూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.7గా నమోదైంది.ఈ భూకంపం వల్ల ఇండోనేషియా సర్కారు సునామీ హెచ్చరికలు జారీ చేసింది.ఈ ఏడాది మే నెలలో శుక్రవారం ఇండోనేషియాలోని సుమత్రా ద్వీపం యొక్క వాయువ్య తీరంలో 6.6 తీవ్రతతో భూకంపం సంభవించిందని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ తెలిపింది.ఇండోనేషియాలో చివరిసారిగా 2004వ సంవత్సరంలో భూకంపం సంభవించింది. 2004 వ సంవత్సరం డిసెంబర్ 26 వాయువ్య సుమత్రా తీరంలో 9.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీనివల్ల ఇండోనేషియా, శ్రీలంక, భారతదేశం, థాయ్‌లాండ్, తొమ్మిది దేశాల్లో సంభవించిన సునామీ వల్ల 2,30,000 మందికి పైగా మరణించారు. సునామీ హెచ్చరికలతో సముద్రతీర ప్రాంత దేశాలు అప్రమత్తమయ్యాయి.

Updated Date - 2021-12-14T15:37:53+05:30 IST