Advertisement
Advertisement
Abn logo
Advertisement

సెమీస్‌లో సింధు

సాత్విక్‌-చిరాగ్‌ జోడీ కూడా

ఇండోనేసియా ఓపెన్‌


బాలి: స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు ఇండోనేసియా సూపర్‌-1000 టోర్నీలో సెమీ్‌సకు దూసుకెళ్లింది. అలాగే డబుల్స్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి కూడా సెమీఫైనల్లో ప్రవేశించారు. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ఫైనల్లో మూడో సీడ్‌ సింధు 14-21, 21-19, 21-14తో కొరియాకు చెందిన సిమ్‌ యూజిన్‌పై విజయం సాధించింది. శనివారం జరిగే సెమీ్‌సలో రెండో సీడ్‌ రచనోక్‌ ఇంటానన్‌ (థాయ్‌లాండ్‌)తో సింధు అమీతుమీ తేల్చుకుంటుంది. ఇక పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ఫైనల్లో వరల్డ్‌ 16వ ర్యాంకర్‌ సాయిప్రణీత్‌ 12-21, 8-21తో ఒలింపిక్‌ చాంపియన్‌ విక్టర్‌ అక్సెల్‌సెన్‌ (డెన్మార్క్‌) చేతిలో ఓడిపోయాడు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌/చిరాగ్‌ శెట్టి ద్వయం 21-19, 21-19తో గో జీ/నూర్‌ ఇజుద్దీన్‌ (మలేసియా) జంటపై గెలుపొంది సెమీఫైనల్లో అడుగుపెట్టింది. 

Advertisement
Advertisement