బాలీవుడ్ పాటకు ఇండోనేషియన్స్ డ్యాన్స్.. వీడియో వైరల్

కరోనా అనంతరం థియేటర్లు తెరచుకోగానే బాలీవుడ్‌లో విడుదలైన మొదటి సినిమా సూర్యవంశీ. ఆ చిత్రం విడుదలవగ్గానే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ  ప్రేక్షకులు  థియేటర్లకు పోటెత్తడం మొదలుపెట్టారు. తాజాగా సూర్యవంశీ సినిమాలోని నాజా, నాజా పాటకు ఇండోనేసియన్ యూట్యూబర్స్ డ్యాన్స్ చేశారు. వారు డ్యాన్స్ చేసిన వీడియోను అక్షయ్ కుమార్ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకోవడంతో ఆ వీడియో వైరల్‌గా మారింది. 


వినఫాన్ అనే యూట్యూబర్ ఇండోనేషియాకు చెందినవాడు. బాలీవుడ్ పాటలకు డ్యాన్స్‌లు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటాడు. తాజాగా వినఫాన్ మరొకరితో కలిసి సూర్యవంశీ చిత్రంలో వచ్చిన నాజానాజా పాటకు డ్యాన్స్ చేశారు. వారు డ్యాన్స్ చేసిన వీడియో అక్షయ్ కుమార్ దృష్టికి చేరింది. అక్కీ ఆ వీడియోను రీ పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్ కింద ‘‘ మీ రీ క్రియేషన్‌ నాకు నచ్చింది. అద్భుతమైన ప్రయత్నం ’’ అంటూ అక్షయ్ కామెంట్ చేశాడు.  దీంతో ఆ వీడియో నెట్టింట వైరల్ అవ్వడం మొదలుపెట్టింది. 


ఆ వీడియోను ఇప్పటికే 3లక్షల మందికి పైగా నెటిజన్లు వీక్షించారు. సూర్యవంశీ సినిమాలో అక్షయ్, కత్రినా మాదిరిగానే వారు స్టెప్స్ వేయడంతో నెటిజన్లు ఫిదా అయ్యారు. ఆ యూట్యూబర్స్‌కి అభినందనలు తెలుపుతూ సోషల్ మీడియా యూజర్స్ కామెంట్స్ చేస్తున్నారు. ‘‘ అద్భుతంగా మీరు డ్యాన్స్ చేశారు ’’ అని ఒక నెటిజన్ కామెంట్ చేశాడు.  ‘‘ ఎక్సలెంట్’’ అని మరో నెటిజన్ తన స్పందనను తెలిపాడు.


Advertisement

Bollywoodమరిన్ని...