‘ఇంద్రగంటి శ్రీకాంత శర్మ’ సాహితీ పురస్కారం

ABN , First Publish Date - 2020-08-03T06:14:25+05:30 IST

2019 జూలై 25న స్వర్గస్తులైన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ ప్రథమవర్థంతి సందర్భాన్ని పురస్కరించుకుని వారి కుటుంబ సభ్యులు ‘ఇంద్రగంటి శ్రీకాంత శర్మ సాహితీ పురస్కారం’...

‘ఇంద్రగంటి శ్రీకాంత శర్మ’ సాహితీ పురస్కారం

2019 జూలై 25న స్వర్గస్తులైన  శ్రీ ఇంద్రగంటి  శ్రీకాంత శర్మ ప్రథమవర్థంతి సందర్భాన్ని పురస్కరించుకుని వారి కుటుంబ సభ్యులు ‘ఇంద్రగంటి శ్రీకాంత శర్మ  సాహితీ పురస్కారం’ ఏర్పాటు చేశారు. ప్రతి ఏటా ఒక సాహితీ వేత్తకి రూ.25000/- (ఇరవై ఐదు వేల రూపాయలు) నగదుతోబాటు చిరు సత్కారం చేసే విధంగా కమిటీ నిర్ణయించింది. 2020 సంవత్సరానికిగాను ప్రముఖ కవి శిఖామణి గారికి ఈ పురస్కారాన్ని ప్రదానం చేయాలని నిర్ణయించడమైంది. కోవిడ్‌ విపత్కర పరిస్థితి తగ్గుముఖం పట్టాక జరిపే సభలో పురస్కార ప్రదానం జరుగుతుంది. శీలాసుభద్రాదేవి, మోహనకృష్ణ ఇంద్రగంటి, కిరణ్మయి  ఇంద్రగంటి  కమిటీ సభ్యులుగా వ్యవహరించారు.

ఇంద్రగంటి సాహితీ పురస్కార కమిటీ

Updated Date - 2020-08-03T06:14:25+05:30 IST