అమెరికావాసికి ఇందూర్ క్యాన్సర్ హాస్పిటల్‌లో విజయవంతమైన ఆపరేషన్

ABN , First Publish Date - 2021-06-11T23:35:53+05:30 IST

అత్యాధునిక వైద్య సదుపాయాలంటే ఎవరికైనా హైదరాబాద్ గుర్తుకు వస్తుంది. ఎన్నో దేశాల నుంచి రోగులు వైద్య సేవల కోసం నగరానికి వస్తుంటారు. అయితే ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లోని

అమెరికావాసికి ఇందూర్ క్యాన్సర్ హాస్పిటల్‌లో విజయవంతమైన ఆపరేషన్

నిజామాబాద్: అత్యాధునిక వైద్య సదుపాయాలంటే ఎవరికైనా హైదరాబాద్ గుర్తుకు వస్తుంది. ఎన్నో దేశాల నుంచి రోగులు వైద్య సేవల కోసం నగరానికి వస్తుంటారు. అయితే ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లోని చిన్న చిన్న టౌన్‌లలోను అత్యుత్తమ వైద్య సేవలు అందుతున్నాయి. ఈ దిశగా డాక్టర్లు చేస్తున్న కృషికి నిజామాబాద్‌ జిల్లాలోని ‘ఇందూర్ క్యాన్సర్ హాస్పిటల్’ నిదర్శనంగా నిలుస్తోంది. ఆ హాస్పిటల్‌కు విదేశీయులు వచ్చి చికిత్సలు చేయించుకుంటున్నారు. తాజాగా రాడ్నీ హెన్రీ జేమ్స్‌ అనే అమెరికన్ అక్కడ ఆపరేషన్ చేయించుకున్నారు. స్వరపేటిక క్యాన్సర్‌తో బాధ పడుతున్న ఆయన.. అమెరికాలో వైద్యానికి అయ్యే ఖర్చులు భరించలేక చికిత్సకు వెనకాడారు. ఈ విషయం తెలుసుకున్న ‘ఇందూర్ క్యాన్సర్ హాస్పిటల్’ అధినేత డాక్టర్ చినబాబు వెంటనే ఆయన్ను భారత్‌కు ఆహ్వానించారు. ఆయనకు 33 ఫ్రాక్షన్స్‌తో కూడుకున్న ఐ.ఎమ్.ఆర్.టి. చికిత్సను అందించారు. ఈ రేడియేషన్ చికిత్స ఎటువంటి దుష్ప్రభావాలు(సైడ్ ఎఫెక్ట్స్) లేకుండా విజయవంతంగా ముగిసింది.   


అత్యంత ఆధునిక వైద్యపరికరాలు, సుశిక్షితులైన వైద్యులతో ఉత్తర తెలంగాణాలోని ఆదిలాబాద్, నిర్మల, జగిత్యాల, కామారెడ్డి, మెదక్ జిల్లాల పేదప్రజలకు వైద్యసేవలు అందిస్తోంది ఇందూర్ కాన్సర్ హాస్పిటల్. ఖండఖండాంతర రోగులకు సైతం ఉత్తమ చికిత్స నందించే స్థాయికి నేడు ఈ హాస్పిటల్ ఎదిగింది.  


ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో రాడ్నీ హెన్రీ జేమ్స్ మాట్లాడుతూ, వైద్యులు, ఇతర సిబ్బంది అంకితభానంతో చేసిన వైద్య సేవలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. మారుమూలప్రాంతంలో కూడా అమెరికాతో సమానంగా అత్యుత్తమ వైద్యసేవలను అందించడం ఎంతో సంభ్రమాశ్చర్యాలకు గురిచేసిందన్నారు. ఈ ప్రెస్ మీట్‌లో క్యాన్సర్ సర్జన్ డాక్టర్ చిన్నబాబు, డైరెక్టర్ కిరణ్, హాస్పిటల్ హెడ్ డాక్టర్ ప్రద్యుమ్నా రెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-11T23:35:53+05:30 IST