Advertisement
Advertisement
Abn logo
Advertisement

నిరుద్యోగం ప్రబలిపోయింది: యనమల

అమరావతి: రెండేళ్ల జగన్ రెడ్డి పాలనలో మూలధన వ్యయం గణనీయంగా తగ్గిపోయిందని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పారిశ్రామిక పెట్టుబడులు తగ్గిపోయి నిరుద్యోగం ప్రబలిపోయిందని చెప్పారు. వాణిజ్య ఉత్సవంలో సీఎం జగన్ వాస్తవ గణాంకాలను మరుగునబెట్టి.. అభివృద్ధి సాధించామని చెప్పడం పారిశ్రామికవేత్తలను వంచించడమేనని దుయ్యబట్టారు. గత రెండేళ్లలో పారిశ్రామిక, అనుబంధ రంగాలు తిరోగమనంలో ఉన్నాయని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి అయిదు నెలల్లో రాష్ట్రంలో జీఎస్టీ వసూళ్లు.. 34శాతం పడిపోవడం వాణిజ్యరంగ దుస్థితికి అద్దం పడుతోందని యనమల రామకృష్ణుడు తెలిపారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement