పరిశ్రమలు సామాజిక బాధ్యతతో ఉండాలి

ABN , First Publish Date - 2021-01-21T06:13:19+05:30 IST

చేగుంట, నార్సింగి మండలాల్లోని వివిధ పరిశ్రమల యజమానులు సామాజిక బాధ్యతతో ఆయా గ్రామాల అభివృద్ధికి తోడ్పాటునందించాలని ఎమ్మెల్యే రఘునందన్‌రావు కోరారు. బుధవారం ఆయన చేగుంట ఎంపీడీవో కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

పరిశ్రమలు సామాజిక బాధ్యతతో ఉండాలి

పరిసర గ్రామాల అభివృద్ధికి తోడ్పాటును అందించాలి 

దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌్‌రావు 


చేగుంట, జనవరి 20 : చేగుంట, నార్సింగి మండలాల్లోని వివిధ పరిశ్రమల యజమానులు సామాజిక బాధ్యతతో ఆయా గ్రామాల అభివృద్ధికి తోడ్పాటునందించాలని ఎమ్మెల్యే రఘునందన్‌రావు కోరారు. బుధవారం ఆయన చేగుంట ఎంపీడీవో కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థ జలాలు, కాలుష్యంతో రైతులు పంటలను కోల్పోతే నష్టపరిహారం ఇచ్చేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. చేగుంటలో గతంలో పరిశ్రమల వద్ద తైబజార్‌ పన్ను వసూలు చేసిన పంచాయతీ సిబ్బంది ప్రస్తుతం ఆ పని చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వ్యవసాయ బోరు మోటార్‌కు విద్యుత్‌ కనెక్షన్‌ కోసం రైతులు డీడీలు కట్టి ఆరేళ్లు గడుస్తున్నా స్పందించకపోవడంపై ఏడీ సంతో్‌షకుమార్‌పై మండిపడ్డారు. అంతకుముందు చేగుంటలోని పలు వీధుల్లో  తిరుగుతూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల శాఖ డీఈ శ్రీనివాసరావు, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ఏఈ రఘు, డీఎల్‌పీవో వరలక్ష్మి, ఎంపీడీవో ఉమాదేవి, తహసీల్దార్‌ మనోహర్‌ చక్రవర్తి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


Updated Date - 2021-01-21T06:13:19+05:30 IST