Advertisement
Advertisement
Abn logo
Advertisement

పరిశ్రమలను ప్రోత్సహించాలి

 జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి సెల్వరాజన

అనంతపురం, డిసెంబరు3(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను సకాలంలో అందించి, పరిశ్రమలను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి సెల్వరాజన.. సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం ఆమె కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స హాల్‌లో జిల్లా పరిశ్రమలు, ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. జిల్లాలో 2020-21లో ఇప్పటి వరకూ 44 యూనిట్లకు సంబంధించి 57 క్లెయిమ్‌లకు రూ.2.32 కోట్ల ప్రోత్సాహకాలను పరిశ్రమలకు అందజేశామన్నారు. స్టాండప్‌ ఇండియా పథకానికి సంబంధించి 244 యూనిట్లకు రూ.56.48 కోట్ల రుణాలను ఆమోదించామన్నారు. బ్యాంకర్లు క్షేత్రస్థాయిలో పరిశీలించి, రుణాలను మంజూరు చేయాలన్నారు. సింగిల్‌ డెస్క్‌ పాలసీకి సంబంధించి అప్రూవల్‌ను గడువులోపు పరిష్కరించాలన్నారు. వివిధ రకాల పరిశ్రమల్లో పనిచేసేందుకు వీలుగా నైపుణ్యాభివృద్ధిపై విద్యార్థులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. జిల్లా పరిశ్రమలు, ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశాన్ని ప్రతినెలా 4వ శుక్రవారం నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జేసీ గంగాధర్‌ గౌడ్‌, పరిశ్రమల శాఖ జీఎం నాగరాజారావు, లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ వెంకటరాజు, నాబార్డు ఏజీఎం ఉషామధుసూదన, హార్టికల్చర్‌ ఏడీ సతీష్‌, పశుసంవర్థక శాఖ జేడీ వెంకటేష్‌, నగరపాలక సంస్థ కమిషనర్‌ పీవీవీఎస్‌ మూర్తి, కార్మికశాఖ డీసీ విజయభాస్కర్‌రెడ్డి, పొల్యూషన కంట్రోల్‌ బోర్డు ఈఈ శంకర్రావు, డీటీడబ్ల్యూఓ అన్నాదొర, ఏపీఎస్పీడీసీఎల్‌ ఎస్‌ఈ నాగరాజు, జిల్లా చాంబర్‌ ప్రెసిడెంట్‌ శేషాంజనేయులు, వ్యవసాయ శాఖ ఏడీ పద్మలత, అహుడా అధికారి చిన్నయ్య, స్కిల్‌ డెవల్‌పమెంట్‌ జిల్లా మేనేజర్‌ శ్రీకాంత రెడ్డి, ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్లు, జిల్లా ఫైర్‌ అధికారులు పాల్గొన్నారు.


Advertisement
Advertisement