పరిశ్రమల్లో తగ్గి.. ఇళ్లల్లో పెరిగింది..!

ABN , First Publish Date - 2020-03-30T08:58:15+05:30 IST

కరోనా ఎఫెక్ట్ట్‌తో విద్యుత్‌ వినియోగంలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. లాక్‌డౌన్‌తో జిల్లాలో పరిశ్రమలు

పరిశ్రమల్లో తగ్గి.. ఇళ్లల్లో పెరిగింది..!

మొత్తంగా తగ్గిన విద్యుత్‌ వినియోగం 


మండపేట, మార్చి 29: కరోనా ఎఫెక్ట్ట్‌తో విద్యుత్‌ వినియోగంలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. లాక్‌డౌన్‌తో జిల్లాలో పరిశ్రమలు చాలావరకు మూతపడ్డాయి. దీంతో అక్కడ విద్యుత్‌ వాడకం 20శాతం తగ్గుదల కనిపించిందని విద్యుత్‌శాఖ ఎస్‌ఈ సత్యనారాయణరెడ్డి తెలిపారు. జిల్లాకు సంబంధించి గృహావసరాలకు విద్యుత్‌ వినియోగం 10శాతం పెరిగిందని వెల్లడించారు. రోజూ జిల్లాలో గృహ, వ్యవసాయ పరిశ్రమల అవసరాలకు సంబంధించి 14.5 నుంచి 15 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ వినియోగించేవారు.


ప్రస్తుతం పరిశ్రమలు మూతపడడంతో 13.7 మిలియన్‌ యూనిట్ల వాడకం ఉంది. జిల్లా మొత్తం మీద 15.50లక్షల విద్యుత్‌ కనెక్షన్‌లు ఉన్నాయి. వాటిలో 14.30 లక్షల మేర గృహ విద్యుత్‌ కనెక్షన్‌లు ఉండగా వ్యవసాయ బోర్లకు సంబంధించి 46,800 వరకు ఉన్నాయి. పరిశ్రమలకు సంబంధించి 1.20 లక్షల మేర కనెక్షన్‌లు ఉన్నాయి. మొత్తంమీద ప్రస్తుతం ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావడంతో విద్యుత్‌ వినియోగం పెరిగినా పరిశ్రమల్లో వినియోగం తగ్గడంతో మొత్తంగా వాడకం తగ్గినట్టుగానే అధికారులు చెప్తున్నారు.


Updated Date - 2020-03-30T08:58:15+05:30 IST