కొవిడ్‌ చికిత్సలో పరిశ్రమల చేయూత!

ABN , First Publish Date - 2021-05-14T08:19:53+05:30 IST

కరోనా క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కోడానికి పరిశ్రమలు తమ సీఎ్‌సఆర్‌ నిధుల ద్వారా భాగస్వామ్యం అవ్వాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి పిలుపు నిచ్చారు. తన బాధ్య

కొవిడ్‌ చికిత్సలో పరిశ్రమల చేయూత!

రాష్ట్రస్థాయిలో ప్రత్యేక సెల్‌ ఏర్పాటు: గౌతమ్‌రెడ్డి

అమరావతి, మే 13(ఆంధ్రజ్యోతి): కరోనా క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కోడానికి పరిశ్రమలు తమ సీఎ్‌సఆర్‌ నిధుల ద్వారా భాగస్వామ్యం అవ్వాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి పిలుపు నిచ్చారు. తన బాధ్యతగా సొంత సంస్థ కేఎంసీ నుంచి రూ.1.5 కోట్లు సీఎంఆర్‌ఎ్‌ఫకు ప్రకటించారు. స్థానిక ప్రజల కోసం, ఆస్పత్రుల్లో వసతులు, ఆక్సిజన్‌ సిలిండర్లు, ఇతర సౌకర్యాల కోసం పరిశ్రమలు సాయం చేయాలన్నారు. సామాజిక బాధ్యతను చాటిన ప్రతి పరిశ్రమను గుర్తించి గౌరవించి చిరు సత్కారం, సర్టిఫికెట్‌ అందిస్తామన్నారు. పీఎ్‌సఏ ప్లాంటు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించిందని పరిశ్రమల శాఖ డైరెక్టర్‌ సుబ్రమణ్యం జవ్వాది తెలిపారు. సీఎ్‌సఆర్‌ నిధులకు సంబంధించి ఏ విషయంలోనైనా సహకారం, విరాళం కోసం పరిశ్రమలు సంప్రదించేందుకు రాష్ట్రస్థాయి సీఎ్‌సఆర్‌ సెల్‌ ఏర్పాటు చేశారు. పరిశ్రమల శాఖ జాయింట్‌ డైరెక్టర్లు ఏఏఎల్‌ పద్మావతి(సెల్‌ నెంబరు 9640909844) వీఆర్‌ విజయరాఘవ నాయక్‌(సెల్‌ నెంబరు 9985539983) ఆధ్వర్యంలో ఈ సెల్‌ ఏర్పాటు చేశామన్నారు. 


మంత్రి పిలుపుతో కోటి రూపాయల విరాళం ఇచ్చేందుకు అమర రాజా బ్యాటరీ సంస్థ ముందుకొచ్చింది. చిత్తూరు జిల్లాలో ఎక్కడైనా 500 బెడ్ల ఏర్పాటుకు కృషిచేస్తామని  ఆ సంస్థ ప్రతినిధి విజయానంద్‌ చెప్పారు. మరోవైపు 5లీటర్ల సామర్థ్యమున్న 50 ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లను తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌కు అందిస్తామని హిందుస్థాన్‌ యూనీలివర్‌ పరిశ్రమ ప్రతినిధి సతీష్‌ ప్రకటించారు. కర్నూలులోని రామ్‌కో కంపెనీ స్థానిక పీహెచ్‌సీలో వసతులు, కొవిడ్‌ ప్రభావం ఉన్న ప్రాంతాల్లో శానిటైజేషన్‌ విషయంలో సహకరిస్తున్నామని పేర్కొంది. సీసీఎల్‌ ప్రొడక్‌ ్ట్స ఇండియా లిమిటెడ్‌ రూ.1.11 కోట్లు విరాళం ఇచ్చినట్లు ఆ సంస్థ ప్రతినిధి దుగ్గిరాల తెలిపారు. మరింత సహకారం అందించేందుకు ముందుకొస్తామన్నారు. రూ.75లక్షల సీఎ్‌సఆర్‌ నిధులను సీఎంఆర్‌ఎ్‌ఫకు అందిస్తామని డిక్సన్‌ కంపెనీ ప్రకటించింది. సీఎ్‌సఆర్‌ నిధుల ద్వారా అన్ని విధాలా సహకారం అందిస్తామని శ్రీసిటీ ఎండీ రవి సన్నారెడ్డి పేర్కొన్నారు. ఆగస్టు నుంచి ప్రతిరోజు 140 టన్నుల ఆక్సిజన్‌ సరఫరాకు సన్నద్ధమయ్యామని, సీఎ్‌సఆర్‌ కింద సీఎంఆర్‌ఎ్‌ఫకు గతంలోనే రెండుకోట్లు ఇచ్చామని తెలిపారు.

Updated Date - 2021-05-14T08:19:53+05:30 IST