అసంక్రమణ వ్యాధుల నివారణ శిబిరం పరిశీలన

ABN , First Publish Date - 2020-12-04T05:52:09+05:30 IST

మండలంలోని దంతన్‌పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న హన్మాన్‌నగర్‌లో అసంక్రమణ వ్యాధుల నివారణ శిబిరాన్ని రాష్ట్ర పరిశీలకులు డాక్టర్‌ నీరజ్‌ పరిశీలించారు.

అసంక్రమణ వ్యాధుల నివారణ శిబిరం పరిశీలన

ఉట్నూర్‌, డిసెంబరు 3: మండలంలోని దంతన్‌పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న హన్మాన్‌నగర్‌లో అసంక్రమణ వ్యాధుల నివారణ శిబిరాన్ని రాష్ట్ర పరిశీలకులు డాక్టర్‌ నీరజ్‌ పరిశీలించారు. గురువారం ముందుగా దంతన్‌పల్లి పీహెచ్‌సీకి చేరుకున్న ఆయన పీహెచ్‌సీలో అసంక్రమణ వ్యాధులైన క్యాన్సర్‌, నోటిక్యాన్సర్‌, డయాబెటిస్‌, రక్తపోటు వ్యాధులకు కావాల్సిన మందులు అందుబాటులో ఉన్నాయా లేదా ఉంటే రోగులను ఎలా గుర్తించి క్రమం తప్పకుండా మందులు అందిస్తున్నారో అనే విషయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా అందుబాటులో ఉన్న మందుల వివరాలను సేకరించారు. హన్మాన్‌నగర్‌లో నిర్వహించిన శిబిరంలో రోగులతో మాట్లాడుతూ సకాలంలో శిబిరాల ద్వారా వైద్య సేవలు అందుతున్నాయా లేదా అని తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అసంక్రమణ వ్యాధుల జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్‌ డాక్టర్‌ క్రాంతి, పీహెచ్‌సీ డాక్టర్‌ కోవ అనురాధ, హెచ్‌ఈ సత్యనారాయణ, సునీత తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-04T05:52:09+05:30 IST