సిరివెన్నెల మృతికి అనంత నివాళి

ABN , First Publish Date - 2021-12-01T06:12:19+05:30 IST

ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాసి్త్ర అకాల మృతికి అనంత నివాళి అర్పించింది.

సిరివెన్నెల మృతికి అనంత నివాళి

 రాయదుర్గంటౌన/అనంతపురం అర్బన, నవంబరు 30: ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాసి్త్ర అకాల మృతికి అనంత నివాళి అర్పించింది. ఆయన మరణం సాహితీలోకానికి, సినీ రంగానికి తీరనిలోటని పలువురు సాహితీవేత్తలు పేర్కొన్నారు. ఆయన రాసిన గేయాలు అజరామరమని కొనియాడారు.


సాహితీలోకానికి తీరనిలోటు

సిరివెన్నెల మరణం సాహితీలోకానికి తీరనిలోటని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. మూడున్నర ద శాబ్దాలపాటు 165 చిత్రాలకు పాటలు రాసిన ఆ యన మరణం బాధాకరమన్నారు. ప్రాచీన సాహిత్యపు లోతులను ఆధునిక గేయాల్లో చూపించిన ఘనత సిరివెన్నెల సీతారామశాసి్త్రకే దక్కుతుందన్నారు. సాహితీ జ్ఞాన సంపన్నుడు సిరివెన్నెల మృ తికి ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.


సినీరంగానికి తీరనిలోటు

సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్ర్తి మరణం, సినీ, కళారంగానికి తీరనిలోటని అనంత సినీ కల్చరల్‌ కమిటీ ప్రతినిధి, ఎస్కేయూ రసాయనశాస్త్ర విభాగ ప్రొఫెసర్‌ సుధాకర్‌బాబు మం గళవారం ప్రకటనలో తెలిపారు. మూడువేలకుపైగా గేయాలను రచించిన ఆయన ప్రజల హృదయాల్లో సజీవంగా ఉండిపోయారన్నారు. సిరివెన్నె ల ఆత్మకు శాంతిచేకూర్చి, ఆయన కుటుంబ సభ్యులకు దేవుడు మనోస్థైర్యాన్ని ప్రసాదించాలని ఆయ న వేడుకున్నారు.

Updated Date - 2021-12-01T06:12:19+05:30 IST