జిల్లావ్యాప్తంగా ఎన్టీఆర్‌ వర్ధంతి

ABN , First Publish Date - 2022-01-19T06:39:43+05:30 IST

యుగపురుషుడికి అనంత ఘన నివాళి అర్పించింది.

జిల్లావ్యాప్తంగా ఎన్టీఆర్‌ వర్ధంతి
రాయదుర్గంలో ఎన్టీఆర్‌కు నివాళులర్పిస్తున్న మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు, నేతలు

యుగపురుషుడికి అనంత నివాళి

ఆయన విగ్రహాలు, చిత్రపటాలకు తమ్ముళ్ల పూజలు

రక్తదానాలు, సామాజిక సేవాకార్యక్రమాల నిర్వహణ

అనంతపురం వైద్యం, జనవరి 18: యుగపురుషుడికి అనంత ఘన నివాళి అర్పించింది. బడుగుల ఆశాజ్యోతి, తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు (ఎ న్టీఆర్‌)కు ఊరువాడా పూజలు నిర్వహించి, అభిమానం చాటుకున్నారు. మంగళవారం ఆయన వర్ధంతిని తెలుగు తమ్ముళ్లు, అభిమానులు జిల్లావ్యాప్తంగా పెద్దఎత్తున నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా రక్తదానాలు, సామాజిక సేవాకార్యక్రమా లు చేపట్టారు. రాయదుర్గంలో మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు.. శ్రేణులతో కలిసి ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. పలువురు టీడీపీ అభిమానులు రక్తదానం చేసి, అభిమానం చాటుకున్నారు. పుట్టపర్తి నియోజకవర్గం కొత్తచెరువులో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి.. తెలుగు తమ్ముళ్లతో కలిసి ఎన్టీఆర్‌కు నివాళి అర్పించారు. పెనుకొండ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ హిందూపురం పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు బీకే పార్థసారథి.. శ్రేణులతో కలిసి ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు. గోరంట్లలో మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప, అనంతపురంలో మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకరచౌదరి ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌కు ఘన నివాళులర్పించారు. లలితకళాపరిషతలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయగా, 99 మంది రక్తదానం చేశారు. కదిరిలో మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌.. తమ్ముళ్లతో కలిసి ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు. రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. తాడిపత్రిలో ఇనచార్జ్‌ జేసీ అశ్మితరెడ్డి.. ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళులర్పించి, ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. కళ్యాణదుర్గంలో ఇనచార్జ్‌ మాదినేని ఉమామహేశ్వరనాయుడు ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు. మడకశిరలో మాజీ ఎమ్మెల్యే ఈరన్న, గుంతకల్లులో మాజీ ఎమ్మెల్యే జితేంద్రగౌడ్‌, గుత్తిలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వెంకటశివుడు యాదవ్‌, శింగనమల, ఉరవకొండ, ధర్మవరం, రాప్తాడు నియోజకవర్గాల్లో పార్టీ నేతల ఆధ్వర్యంలో తారకరాముడికి ఘన నివాళులర్పించారు.








Updated Date - 2022-01-19T06:39:43+05:30 IST