Advertisement
Advertisement
Abn logo
Advertisement

అంతు తెలియని బావి!

గ్రామాల్లో బావులను చూసే ఉంటారు. బావుల్లోని నీళ్లు తాగడానికి, వ్యవసాయానికి ఉపయోగిస్తుంటారు. వర్షాలు సమృద్ధిగా కురవకపోతే బావుల్లో నీళ్లు తగ్గిపోతాయి. వేసవికాలంలో చాలా బావులు చుక్క నీరు లేకుండా ఎండిపోతుంటాయి. కానీ ఫ్రాన్స్‌లోని బుర్గుండీ ప్రాంతంలో ఉన్న ఒక బావిలో నీళ్లు ప్రవాహంలా ఎల్లప్పుడూ బయటకు వస్తుంటాయి. కొన్ని వందల సంవత్సరాల నుంచి ఆ బావిలో నీళ్లు అలా వస్తూనే ఉన్నాయి. బావిలో నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకునేందుకు చాలామంది ప్రయత్నించి విఫలమయ్యారు. కొంతమంది చనిపోయారు కూడా. నైపుణ్యం గల డైవర్లు కూడా ఆ బావి అంతు తెలుసుకోలేకపోయారు. ఇప్పటికీ ఆ బావిలో నీళ్లకు సోర్స్‌ ఏమిటో కనుక్కోలేకపోయారు. 17వ శతాబ్దంలో ఫ్రెంచ్‌ ప్రజలు పబ్లిక్‌ బాత్‌హౌజ్‌గా ఈ బావిని ఉపయోగించారు. శతాబ్దాలు గడిచినా బావిలో నీళ్లు మాత్రం తగ్గలేదు. 1974లో ఇద్దరు ప్రొఫెషనర్లు డైవర్లు బావి అడుగుభాగంలో చాలా దూరం ప్రయాణించగలిగారు. కానీ వాటర్‌ సోర్స్‌ను మాత్రం కనుక్కోలేకపోయారు. గత ఏడాది మరో ఇద్దరు డైవర్లు బావి ముఖద్వారం నుంచి 370 మీటర్ల దూరం వరకు వెళ్లగలిగారు. కానీ వాళ్లు కూడా నీటి ఊట ఎక్కడుందో కనుక్కోలేకపోయారు. 

Advertisement
Advertisement