లాంచింగ్‌కు వారం ముందే లీకైన ‘ఇన్ఫినిక్స్ హాట్ 11ఎస్’ స్పెసిఫికేషన్లు

ABN , First Publish Date - 2021-09-11T22:27:55+05:30 IST

హాంకాంగ్ మొబైల్ మేకర్ ఇన్ఫినిక్స్ వచ్చేవారం భారత్‌లో మరో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయబోతోంది

లాంచింగ్‌కు వారం ముందే లీకైన ‘ఇన్ఫినిక్స్ హాట్ 11ఎస్’ స్పెసిఫికేషన్లు

న్యూఢిల్లీ: హాంకాంగ్ మొబైల్ మేకర్ ఇన్ఫినిక్స్ వచ్చేవారం భారత్‌లో మరో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయబోతోంది. ‘హాట్ 11ఎస్’ పేరుతో వస్తున్న ఈ ఫోన్ 17న లాంచ్ కానుండగా అంతకు వారం రోజుల ముందే దాని ముఖ్యమైన స్పెసిఫికేషన్లు లీకయ్యాయి. రెండు నెలల క్రితం విడుదలైన ‘హాట్ 10ఎస్’కు సక్సెసర్‌గా దీనిని తీసుకొస్తున్నారు. ‘రెడ్‌మి ప్రైమ్’లో ఉపయోగించిన చిప్‌సెట్‌నే ఇందులోనూ వినియోగించారు. మిడ్ రేంజ్ సెగ్మెంట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్నారు.


లీకైన వివరాలను బట్టి ఇన్ఫినిక్స్ హాట్ 11ఎస్‌లో 6.82 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, మీడియాటెక్ జి88 ప్రాసెసర్‌ను ఉపయోగించినట్టు తెలుస్తుండగా, ర్యామ్ వివరాలు తెలియరాలేదు. అయితే, జి88 ప్రాసెసర్‌తో ఇండియాలో విడుదలవుతున్న రెండో ఫోన్ ఇదే. దీనికంటే ముందు రెడ్‌మి 10 ప్రైమ్‌లో ఇదే చిప్‌సెట్‌ను ఉపయోగించారు. ఇన్ఫినిక్స్ హాట్ 11ఎస్‌లో 50 ఎంపీ ప్రధాన సెన్సార్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ వంటివి ఉపయోగించినట్టు సమాచారం. భారత్‌లో దీని ధర రూ. 15 వేల లోపు ఉండే అవకాశం ఉంది.  

Updated Date - 2021-09-11T22:27:55+05:30 IST