పెద్ద స్ర్కీన్‌... భారీ బ్యాటరీ!

ABN , First Publish Date - 2020-07-25T05:30:00+05:30 IST

మొబైల్‌ వినియోగదారులు మెచ్చే మరో స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లోకి వచ్చేసింది. ఇన్‌ఫినిక్స్‌ స్మార్ట్‌ 4 ప్లస్‌ పేరుతో విడుదలైన ఈ మొబైల్‌లో చాలా ప్రత్యేకతలున్నాయి. ముఖ్యంగా 6000 ఎంఎహెచ్‌ సామర్థ్యం ఉన్న బ్యాటరీ ఉంది...

పెద్ద స్ర్కీన్‌... భారీ బ్యాటరీ!

మొబైల్‌ వినియోగదారులు మెచ్చే మరో స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లోకి వచ్చేసింది. ఇన్‌ఫినిక్స్‌ స్మార్ట్‌ 4 ప్లస్‌ పేరుతో విడుదలైన ఈ మొబైల్‌లో చాలా ప్రత్యేకతలున్నాయి. ముఖ్యంగా 6000 ఎంఎహెచ్‌ సామర్థ్యం ఉన్న  బ్యాటరీ ఉంది. ఇది స్టాండ్‌ బై మోడ్‌లో 31 రోజుల పాటు ఫోన్‌ నిరంతరంగా ఆన్‌లో ఉంచుతుంది. ఇక 38 గంటలపాటు మాట్లాడుకోవచ్చు. మొబైల్‌ ప్రియులను బాగా ఆకట్టుకునే మరో ఫీచర్‌ 6.82 అంగుళాల స్ర్కీన్‌. ఇక రియర్‌లో ట్రిపుల్‌ కెమెరా సెటప్‌ ఉంది. 13 మెగాపిక్సెల్‌ కెమెరాతో పాటు రెండు కెమెరా సెన్సర్లు ఉన్నాయి. నాణ్యమైన ఫొటోలు, వీడియోల కోసం ట్రిపుల్‌ లెడ్‌ఫ్లాష్‌ ఉపయోగపడుతుంది.


సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరా ఉంది. సెక్యూరిటీ కోసం ఫింగర్‌ప్రింట్‌ స్కానర్‌ ఆప్షన్‌ ఉంది. ఆండ్రాయిడ్‌ 10 ఆపరేటింగ్‌ సిస్టంతో వచ్చే ఈ మొబైల్‌ 3 బీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. ఇదే బ్యాటరీ సామర్థ్యంతో సామ్‌సంగ్‌ గెలాక్సీ ఎం31 మొబైల్‌ త్వరలో విడుదల కాబోతోంది. 6 జీబీ ర్యామ్‌, 128 ఇన్‌బిల్ట్‌ స్టోరేజ్‌తో ఈ ఫోన్‌ వస్తోంది. 64 మెగాపిక్సెల్‌ కెమెరా మరో ప్రత్యేకత. మంచి బ్రాండ్‌ ఫోన్‌ కావాలంటే సామ్‌సంగ్‌, పదివేల లోపు ఫోన్‌ కావాలంటే ఇన్‌ఫినిక్స్‌ ఎంచుకోవచ్చు. 

Updated Date - 2020-07-25T05:30:00+05:30 IST