Abn logo
Dec 3 2020 @ 18:23PM

48 ఎంపీ కెమెరాతో భారత మార్కెట్లోకి వచ్చేసిన ‘ఇన్ఫినిక్స్ జీరో 8ఐ’

న్యూఢిల్లీ: ‘ఇన్ఫినిక్స్’ బ్రాండ్ పేరుతో స్మార్ట్‌ఫోన్లు విడుదల చేస్తున్న చైనీస్ మొబైల్ మేకర్ ట్రాన్షన్ హోల్డింగ్స్‌ భారత మార్కెట్లోకి మరో నయా ఫోన్‌ను విడుదల చేసింది. 48 ఎంపీ రియర్ కెమెరా, 90హెర్ట్జ్ డిస్‌ప్లే వంటి ఆకర్షణీయ ఫీచర్లు ఉన్నాయి. ఒక్కసారి చార్జ్‌చేస్తే 49 గంటల వరకు మాట్లాడుకోవచ్చు. అలాగే, 33 వాట్స్ పాస్ట్ చార్జింగ్, 128 జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజీ, డ్యూయల్ సెల్ఫీ కెమెరా వంటివి ఉన్న ఈ ఫోన్‌ అక్టోబరులో పాకిస్థాన్‌లో విడుదలైంది. 


8జీబీ+128జీబీ స్టోరేజీ వేరియంట్ ధర భారత్‌లో 14,999 రూపాయలు. అయితే, ఈ ధర పరిమిత కాలం పాటు మాత్రమే ఉండనుంది. ఫ్లిప్‌కార్ట్ ఈ ఫోన్‌ను రూ. 18,999కి లిస్ట్ చేసింది. ఈ నెల 9 నుంచి ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేసుకోవచ్చు. సిల్వర్ డైమండ్, బ్లాక్ డైమండ్ కలర్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది.  

ఇన్ఫినిక్స్ జీరో 8ఐ స్పెసిఫికేషన్లు:  డ్యూయల్ సిమ్ (నానో), ఆండ్రాయిడ్ 10 ఓఎస్. 6.85 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఐపీఎల్ డిస్‌ప్లే, డీటీఎస్-హెచ్‌డీ సరౌండ్ సౌండ్, ఆక్టాకోర్ మీడియా టెక్ హెలియో జి90టి చిప్‌సెట్, 8జీబీ ర్యామ్, 48 ఎంపీ ప్రధాన సెన్సార్‌తో వెనకవైపు నాలుగు కెమెరాలు, 16 ఎంపీ ప్రధాన సెన్సార్‌తో డ్యూయల్ సెల్ఫీ కెమెరా, 128 జీబీ అంతర్గత మెమొరీ, ఎస్డీకార్డు ద్వారా 256 జీబీ వరకు పెంచుకునే వెసులుబాటు, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్, ఆక్సెలెరోమీటర్, జైరోమీటర్, మ్యాగ్నెటోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్ వంటివి ఉన్నాయి. ఇందులో 4,500 ఎంఏహెచ్ బ్యాటరీని ఉపయోగించారు. 33 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 


Advertisement
Advertisement
Advertisement