ఇన్‌ఫ్లమేషన్‌కు అడ్డుకట్ట!

ABN , First Publish Date - 2020-10-13T17:04:38+05:30 IST

శరీరం ఇన్‌ఫెక్షన్‌తో పోరాడే క్రమంలో అంతర్గతంగా జరిగే ఓ ప్రతిచర్య ‘ఇన్‌ఫ్లమేషన్‌’! సూక్ష్మక్రిముల కారణంగా ఏర్పడే ఇన్‌ఫెక్షన్‌తో పోరాటం కోసం తెల్లరక్తకణాలు ఉద్యుక్తమవడం సహజం.

ఇన్‌ఫ్లమేషన్‌కు అడ్డుకట్ట!

ఆంధ్రజ్యోతి(13-10-2020): శరీరం ఇన్‌ఫెక్షన్‌తో పోరాడే క్రమంలో అంతర్గతంగా జరిగే ఓ ప్రతిచర్య ‘ఇన్‌ఫ్లమేషన్‌’! సూక్ష్మక్రిముల కారణంగా ఏర్పడే ఇన్‌ఫెక్షన్‌తో పోరాటం కోసం తెల్లరక్తకణాలు ఉద్యుక్తమవడం సహజం. ఇది అవసరం కూడా! అయితే తత్ఫలితంగా శరీరంలో తలెత్తే ఇన్‌ఫ్లమేషన్‌ వల్ల అవయవాలు దెబ్బతింటాయి. తట్టుకోలేనంతగా నొప్పులూ వేధిస్తాయి. ఇన్‌ఫ్లమేషన్‌ను అడ్డుకోవడం కోసం మందులు వాడితే వాటి దుష్ప్రభావాలనూ అదనంగా భరించక తప్పదు. కాబట్టి కొన్ని ఆహారపదార్థాలతో సమస్యను అదుపుచేసే ప్రయత్నం చేయాలి.


పుట్టగొడుగులు: వీటిని పచ్చిగా పదార్థాల్లో ఉపయోగిస్తే ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తాయి. కాబట్టి సన్నగా తరిగి సూప్స్‌, పాస్తాల్లో వాడుకోవాలి. స్టిర్‌ ఫ్రై చేసి తినవచ్చు.


ఆకుకూరలు: వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు సెల్యులర్‌ డ్యామేజ్‌ను అరికడతాయి. మెటబాలిక్‌ డిసీజ్‌, పోషకాహార లోపాలూ ఆకుకూరలతో తొలగిపోతాయి. గుండె ఇన్‌ఫ్లమేషన్‌ తగ్గుదలకు ఆకుకూరలు తోడ్పడతాయి.


వెల్లుల్లి: వీటిలోని అత్యధిక యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలు గుండెలోని రక్తనాళాల వాపులను అరికడతాయి. కాబట్టి వెల్లుల్లిని పచ్చిగా లేదా ఉడికించి తింటూ ఉండాలి. 

Updated Date - 2020-10-13T17:04:38+05:30 IST