ఆల్‌టైమ్‌ గరిష్ఠానికి ద్రవ్యోల్బణం

ABN , First Publish Date - 2021-05-18T06:13:32+05:30 IST

టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం మరోసారి రెక్కలు విచ్చింది. ఆహార వస్తువులు, క్రూడాయిల్‌, తయారీ వస్తువుల ధరలు పెరగడంతో ఏప్రిల్‌లో రెండంకెల స్థాయికి చేరి ఆల్‌టైమ్‌ గరిష్ఠ స్థాయి 10.49 శాతంగా నమోదైంది

ఆల్‌టైమ్‌ గరిష్ఠానికి ద్రవ్యోల్బణం

న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం మరోసారి రెక్కలు విచ్చింది. ఆహార వస్తువులు, క్రూడాయిల్‌, తయారీ వస్తువుల ధరలు పెరగడంతో ఏప్రిల్‌లో రెండంకెల స్థాయికి చేరి ఆల్‌టైమ్‌ గరిష్ఠ స్థాయి 10.49 శాతంగా నమోదైంది. కాగా ఈ ధోరణి మరికొంత కాలం కొనసాగవచ్చని నిపుణులంటున్నారు. మార్చిలో ద్రవ్యోల్బణం 7.39 శాతం ఉంది. అయితే గత ఏడాది ఏప్రిల్‌లో -1.57 శాతం ఉండడం వల్లనే (బేస్‌ ఎఫెక్ట్‌) గత నెలలో ఆ స్థాయికి చేరిందని వాణి జ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఏప్రిల్‌ నెలలో ప్రోటీన్లు అధికంగా ఉండే గుడ్లు, మాంసం, చేపల ధరలు పెరగడంతో ఆహార ద్రవ్యోల్బణం 4.92 శాతం ఉన్నట్టు పేర్కొంది. విభాగాల వారీగా చూస్తే గుడ్లు, మాంసం, చేపల ధరలు 10.88 శాతం, పప్పుదినుసుల ధర 10.74 శాతం, పళ్ల ధర 27.43 శాతం పెరిగాయి. 

Updated Date - 2021-05-18T06:13:32+05:30 IST