హరితహారం మొక్కలపై సమాచారం ఇవ్వాలి

ABN , First Publish Date - 2022-01-24T06:35:30+05:30 IST

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో 2017 నుంచి 2019 వరకు కోదాడలో మునిసిపాలిటీలో నాటిన మొక్కలు ఇవ్వాలని సమాచార హక్కు చట్టం కింద అధికారులను కోరానని సామాజిక కార్యకర్త జలగం సుధీర్‌ తెలిపారు. కోదాడలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మొక్కల వివరాలు లేవని, సర్వే చేసి చెబుతారని అధికారులు చెప్పారన్నారు.

హరితహారం మొక్కలపై సమాచారం ఇవ్వాలి

కోదాడ, జనవరి  23: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో  2017 నుంచి 2019 వరకు కోదాడలో మునిసిపాలిటీలో నాటిన మొక్కలు ఇవ్వాలని సమాచార హక్కు చట్టం కింద అధికారులను కోరానని సామాజిక కార్యకర్త జలగం సుధీర్‌ తెలిపారు. కోదాడలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మొక్కల వివరాలు లేవని, సర్వే చేసి చెబుతారని అధికారులు  చెప్పారన్నారు.  ఈ విషయాన్ని రాజ్యసభ సభ్యుడు  జోగినపల్లి సంతోష్‌కు ట్విట్టర్‌ ద్వారా తెలిపానన్నారు.  కోదాడలో హరితహారం, పల్లె ప్రకృతి వనం పనుల్లో ఆవినీతి జరిగిందని, వీటిపై విచారణ చేయాలని సూచించానన్నారు. ఈ విష యాన్ని  కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లి అవినీతి జరిగిందని తేలితే చర్యలు తీసు కుంటామని సంతోష్‌ హామీ ఇచ్చారని తెలిపారు.



Updated Date - 2022-01-24T06:35:30+05:30 IST