Advertisement
Advertisement
Abn logo
Advertisement

పెళ్లయ్యాక యమునలో స్నానం చేయడం కుటుంబ ఆచారం.. ఆ Infosys ఉద్యోగి భార్యతో సహా నదిలోకి దిగాడు.. కానీ..

హరియాణాలోని సోనిపత్ జిల్లాలోగల యమునా నదిలో స్నానం కోసం దిగిన నవవరుడు అత్యంత విచిత్ర పరిస్థితిలో నీట మునిగి కన్నుమూసిన ఉదంతం చోటుచేసుకుంది. పెళ్లి అనంతరం సంప్రదాయబద్ధంగా జరిగే కార్యక్రమం కోసం మిమర్‌పూర్ ఘాట్‌కు వచ్చిన ఇన్ఫోసిస్ ఉద్యోగి నీట మునిగి మృతిచెందాడు. మృతుడు సోనీ‌పత్‌లోని ఉమోద్‌గఢ్ గ్రామానికి చెందిన సందీప్‌(30)గా పోలీసులు గుర్తించారు. సందీన్ తన భార్య, ఇతర కుటుంబ సభ్యులతో పాటు పెళ్లి అనంతరం నిర్వహించాల్సిన సంప్రదాయల కోసం యమునా నది వద్దకు వచ్చాడు. 

కాలు పట్టుతప్పడంతో నదిలో పడి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. కాగా మృతుడు కెనడా వెళ్లే ప్రయత్నంలో ఉండగానే ఈ ఘోరం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే పోలీసుల రావడంలో జాప్యం జరిగిన కారణంగా, సహాయక చర్యలు అందక సందీప్ మృతి చెందాడని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సందీప్ గౌతమ్ పరీదాబాద్‌లోని ఇన్ఫోసిన్ కంపెనీలో పనిచేసేవాడు. ఏడాదిన్నర క్రితమే సందీప్‌కు మనీషాతో వివాహమయ్యింది. వీరి కుటుంబ సంప్రదాయం ప్రకారం పెళ్లయిన నూతన దంపతులు యమునలో స్నానం చేయాల్సివుంటుంది. ఈ నేపధ్యంలోనే ఈ నూతన దంపతులు యమునా నది దగ్గరకు వచ్చారు. ఈ నేపధ్యంలోనే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement