గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించాలి

ABN , First Publish Date - 2021-06-15T06:57:10+05:30 IST

: గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమష్టిగా కృషి చేయాలని జడ్పీ చైర్మన్‌ ఎలిమినేటి సందీప్‌రెడ్డి కోరారు. సోమవారం జడ్పీ కార్యాలయ సమావేశపు హాల్‌లో ఒకటవ(ఆర్థిక), ఏడవ (పనులు) స్థాయి సంఘాల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామా ల్లోని ప్రతి ఇంటికీ నల్లాల ద్వారా శుభ్రమైన నీటిని అందించాలన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించాలి
జడ్పీ స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న సందీప్‌రెడ్డి

 జడ్పీచైర్మన్‌ ఎలిమినేటి సందీప్‌రెడ్డి 

భువనగిరి రూరల్‌, జూన్‌ 14గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించడానికి  అధికారులు, ప్రజాప్రతినిధులు సమష్టిగా కృషి చేయాలని జడ్పీ చైర్మన్‌ ఎలిమినేటి సందీప్‌రెడ్డి కోరారు. సోమవారం జడ్పీ కార్యాలయ సమావేశపు హాల్‌లో ఒకటవ(ఆర్థిక), ఏడవ (పనులు) స్థాయి సంఘాల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామా ల్లోని ప్రతి ఇంటికీ  నల్లాల ద్వారా శుభ్రమైన నీటిని అందించాలన్నారు. మురుగునీరు సాఫీగా వెళ్లడానికి డ్రైనేజీ కాల్వలను నిర్మించాలన్నారు.   జిల్లాలో మంజూరై వివిధ స్థాయిల్లో ఉన్న 312 శ్మశానవాటికల నిర్మాణాలను పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలన్నారు. పూర్తయిన  రైతు వేదిక లను ప్రారంభించాలన్నారు. ఎస్సీ కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలను త్వరిత గతిన పూర్తి చేయాలన్నారు. రాష్ట్రీయ గ్రామ స్వరాజ్‌ యోజన  కింద మం జూరై నిర్మాణంలో ఉన్న నూతన గ్రామ పంచాయతీ భవనాలను పూర్తి చేయాలని, ప్రారంభంకాని పనులకు కొత్త టెండర్లు పిలిచి శంకుస్థాపన   చేయడానికి అధికారులు చొరవ చూపాలన్నారు. కొవి డ్‌తో అప్రమత్తంగా ఉండాలన్నారు. మధ్యాహ్నం నిర్వ హిం చిన  రెండవ స్థాయి సంఘం (గ్రామీణాభివృద్ధి) సమావేశంలో జడ్పీ చైర్మన్‌ మాట్లాడుతూ పరిశ్రమల్లో ఖాళీలను గుర్తించి నిరుద్యోగులను భర్తీ చేయాలని  జిల్లా పరిశ్రమల అధికారి శ్రీలక్ష్మికి సూచించారు. చేనేత కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగుపర్చడానికి  ప్రభు త్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అరు లకు అందించాలని పలువురు సభ్యులు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. సమావేశంలో జడ్పీసీఈవో సీహెచ్‌ కృష్ణారెడ్డి, డిప్యూటీ సీఈవో బి శ్రీనివాసరావు, జడ్పీటీసీలు చామకూర గోపాల్‌, పల్లా వెంకట్‌రెడ్డి, వీర మల్ల భాను, కోట పుష్పలత, వివిధ శాఖల జిల్లా అధికారులు మందడి ఉపేందర్‌రెడ్డి, లక్ష్మణ్‌, శంకరయ్య, నాగేందర్‌, వెంకటేశం, శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు. 




Updated Date - 2021-06-15T06:57:10+05:30 IST