గ్రామాల్లో జ్వరాలపై ఇంటింటా సర్వే

ABN , First Publish Date - 2021-05-17T04:23:53+05:30 IST

కొవిడ్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో గ్రామాల్లో జ్వరాలపై ఇంటింటా సర్వే చేపడుతున్నారు. ఏజెన్సీ వ్యాప్తంగా 36 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 199 ఆరోగ్య ఉపకేంద్రాల పరిధిలో ఈప్రక్రియ జరుగుతున్నది.

గ్రామాల్లో జ్వరాలపై ఇంటింటా సర్వే
మండలంలో భీమసింగిలో జ్వరాల వివరాలు సేకరిస్తున్న ఆశ కార్యకర్తలు


 పాడేరు, మే 16: కొవిడ్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో గ్రామాల్లో జ్వరాలపై ఇంటింటా సర్వే చేపడుతున్నారు. ఏజెన్సీ వ్యాప్తంగా 36 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 199 ఆరోగ్య ఉపకేంద్రాల పరిధిలో ఈప్రక్రియ జరుగుతున్నది. గ్రామాల్లోని ఆశ కార్యకర్తలు, గ్రామ వలంటీర్‌లు కలిసి ఇంటింటికీ తిరిగి జ్వర బాధితుల వివరాలను సేకరిస్తున్నారు. వారు సేకరించిన వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. దీంతో జ్వరం ఉన్న వారి వివరాలు ఆధారంగా పారా మెడికల్‌ సిబ్బంది వెళ్లి జ్వర బాధితులకు అవసరమైన వైద్య సేవలు అందిస్తారు. అలాగే బాధితులకు కరోనా అనుమానిత లక్షణాలుంటే వెంటనే పీహెచ్‌సీకి తరలించి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులు అందిస్తారు. ప్రస్తుతం గ్రామాల్లో జ్వరాలపై ఇంటింటా సర్వే హడావుడి కన్పిస్తున్నది.


 

Updated Date - 2021-05-17T04:23:53+05:30 IST