కొనసాగుతున్న వీఆర్‌ఏల దీక్షలు

ABN , First Publish Date - 2022-08-04T04:34:35+05:30 IST

జిల్లా వ్యాప్తంగా తమ సమస్యలు పరిష్కరించాలని వీఆర్‌ఏలు చేపడుతున్న నిరవధిక దీక్షలు కొనసాగుతున్నాయి.

కొనసాగుతున్న వీఆర్‌ఏల దీక్షలు
లక్షెట్టిపేటలో చీపుర్లతో రోడ్డు ఊడుస్తున్న వీఆర్‌ఏలు

లక్షెట్టిపేట రూరల్‌, ఆగస్టు  3: జిల్లా వ్యాప్తంగా తమ సమస్యలు పరిష్కరించాలని వీఆర్‌ఏలు చేపడుతున్న నిరవధిక దీక్షలు కొనసాగుతున్నాయి. బుధవారం నిరసనల్లో భాగంగా రోడ్లు ఊడుస్తూ నిరనన తలిపారు. లక్షెట్టిపేట మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట వీఆర్‌ఏల దీక్ష శిభిరం వద్ద చీపుర్లతో రోడ్లు ఊడుస్తూ వినూత్న నిరసన చేశారు. తమ డిమాండ్‌లను పరిష్కరించాలని వీఆర్‌ఏలు చేపట్టిన నిరవధిక సమ్మె బుధవారం నాటికి పదో రోజుకు చేరింది. కార్యక్రమంలో వీఆర్‌ఏల జిల్లా కో కన్వీనర్‌ దుంపల ప్రదీప్‌, మండల అద్యక్షుడు సుదమల్ల శ్రీనివాస్‌, ప్రధాన కార్యదర్శి దుంపల రాజశేఖర్‌, చందు, భీంరాజ్‌, ఉదయ్‌,  చందర్‌, కవిత, సుజాత, గంగామణి, రాజ్యలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.  

దండేపల్లి: దండేపల్లిలో చేపట్టిన వీఆర్‌ఏల నిరవధిక ధీక్ష శిబిరంలో బుధవారం చీపులతో రోడ్డు, దీక్ష శిబిరాన్ని ఊడుస్తూ విన్నూత రీతిలో నిరసన తెలిపారు. కార్యక్రమంలో వీఆర్‌ఏల సంఘం మండల అధ్యక్ష,కార్యదర్శులు బల్సు రాజన్న, లింగాల సత్యవతి, వీఆర్‌ఏలు ప్రవీణ్‌కుమార్‌, రాజు, నరేందర్‌, నాగలక్ష్మి, చిన్నమ్మ, ప్రవీణ్‌, అశోక్‌, సాగర్‌, చిన్నయ్య,శిరీష, జ్యోతి, ఉపేందర్‌, సుధాకర్‌, వెంకటేష్‌, సాగర్‌ తదితరులు పాల్గొన్నారు. 

నస్పూర్‌: నస్పూర్‌ తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట వీఆర్‌ఏలు చేపట్టిన నిరవధిక సమ్మె బుధవారం నాటికి పదో రోజుకు చేరుకుంది.  కాంగ్రెస్‌ పార్టీ పట్టణ అధ్యక్షుడు బండారు సుధాకర్‌, మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ సుర్మిళ్ల వేణు, యూత్‌ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు సంపత్‌రెడ్డి, మైనార్టీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు ఎండి ఖలీల్‌, తదితరులు సమ్మెకు మద్దతు తెలిపారు.

జన్నారం: మండలంలో గత పది రోజులుగా వీఆర్‌ఏలు చేస్తున్న నిరవధిక సమ్మె కొనసాగుతుంది. బుధవారం రోడ్లు ఊడ్చి నిరసన తెలిపారు.  కార్యక్రమంలో వీఆర్‌ఏలు రాజశేఖర్‌, రాజలింగు, శ్రీనివాస్‌, రాజ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

జైపూర్‌: మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట సమ్మె చేపడుతున్న వీఆర్‌ఏలు చేస్తున్న  బుధవారం రోడ్లు ఊడ్చి నిరసన తెలిపారు. వీఆర్‌ఏలకు పే స్కేల్‌ అమలు చేయాలని, పదోన్నతులు కల్పించాలని డిమాండ్‌ చేశారు. 

భీమారం: వీఆర్‌ఏల సమస్యలు వెంటనే పరిష్కరించాలని టీడీపీ పెద్దపల్లి పార్లమెంట్‌ అధ్యక్షుడు సంజయ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. బుధవారం భీమారంలో వీఆర్‌ఏలు చేస్తున్న దీక్షలను సందర్శించి మద్దతు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర మహిళ కార్యదర్శి ఎండీ షరీఫా, నాయకులు ఆడెపు బు చ్చన్న, దాసరి కమలాకర్‌, సాయి, లక్ష్మణ్‌, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. 

మందమర్రిరూరల్‌ : స్ధానిక తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట వీఆర్‌ఏలు చేస్తున్న రిలే దీక్షలు బుధవారం కొనసాగాయి. దీక్షలో వీఆర్‌ఏలు శశి, ప్రియమాల, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-04T04:34:35+05:30 IST