కొనసాగుతున్న వీఆర్‌ఏల దీక్షలు

ABN , First Publish Date - 2022-08-17T03:58:35+05:30 IST

సమస్యలు పరిష్కరించాలని వీఆర్‌ఏలు చేస్తున్న నిరవధిక దీక్షలు కొనసాగుతు న్నాయి. మంగళవారం తహసీల్దార్‌ కార్యాలయం నుం చి అంబేద్కర్‌ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. పే స్కేల్‌ అమలు చేయాలని, పదోన్నతులు కల్పించా లని నినాదాలు చేశారు.

కొనసాగుతున్న వీఆర్‌ఏల దీక్షలు
ర్యాలీ నిర్వహిస్తున్న వీఆర్‌ఏలు

కాసిపేట, ఆగస్టు 16: సమస్యలు పరిష్కరించాలని   వీఆర్‌ఏలు చేస్తున్న నిరవధిక దీక్షలు కొనసాగుతు న్నాయి. మంగళవారం తహసీల్దార్‌ కార్యాలయం నుం చి అంబేద్కర్‌ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు.  పే స్కేల్‌ అమలు చేయాలని, పదోన్నతులు కల్పించా లని నినాదాలు చేశారు. వీఆర్‌ఏల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌, వీఆర్‌ఏలుపాల్గొన్నారు. 

దండేపల్లి: సమస్యలు పరిష్కరించాలని వీఆర్‌ఏలు దీక్ష శిబిరం నుంచి బస్టాండ్‌ వరకు ర్యాలీ చేపట్టారు.    అర్హత కలిగిన వారికి పదోన్నతులు కల్పించాలని, వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.  బల్సు రాజన్న, సత్యవతి, ప్రవీణ్‌కుమార్‌, రాజు, నరేందర్‌, నాగలక్ష్మి, చిన్నమ్మ పాల్గొన్నారు.    

నెన్నెల: నెన్నెలలో వీఆర్‌ఏలు ర్యాలీ నిర్వహించారు.   రెగ్యులరైజ్‌ చేస్తామని సీఎం హామీఇచ్చి 17 నెలలు దాటినా అమలు కాలేదన్నారు. వీఆర్‌ఏల జేఏసీ జిల్లా కన్వీనర్‌ దుర్గం శ్రీనివాస్‌, వీఆర్‌ఏలు పాల్గొన్నారు.  

జన్నారం: వీఆర్‌ఏలు తహసీల్దార్‌ కార్యాలయం నుంచి బస్టాండ్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. వీఆర్‌ఏల సంఘం మండల అధ్యక్షుడు రాజశేఖర్‌ మాట్లాడుతూ 23 రోజులుగా దీక్షలు చేస్తున్న ప్రభు త్వం స్పందించడం లేదని తెలిపారు.  

శ్రీరాంపూర్‌: వీఆర్‌ఏలు సీసీసీ హనుమాన్‌ మంది ర్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. సంఘం నాయకులు కార్తీక్‌, రత్నం, భీమరాజు పాల్గొన్నారు. ర్యాలీకి డీవై ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు రాజ్‌కుమార్‌, ఎస్‌ఎఫ్‌ఐ మండల కార్యదర్శి అభినవ్‌ మద్దతు  తెలిపారు.    

Updated Date - 2022-08-17T03:58:35+05:30 IST