కొనసాగుతున్న వీఆర్‌ఏల దీక్షలు

ABN , First Publish Date - 2022-07-30T06:35:53+05:30 IST

డిమాండ్ల సాధన కోసం వీఆర్‌ ఏలు చేపట్టిన దీక్షలు కొనసాగుతున్నాయి. సిరిసిల్ల తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట చేపట్టిన నిరసన దీక్షలు శుక్రవారానికి ఐదో రోజుకు చేరుకున్నాయి.

కొనసాగుతున్న వీఆర్‌ఏల దీక్షలు
బోయినపల్లిలో మద్దతు తెలుపుతున్న కాంగ్రెస్‌ నాయకులు

సిరిసిల్ల టౌన్‌, జూలై 29: డిమాండ్ల సాధన కోసం వీఆర్‌ ఏలు చేపట్టిన దీక్షలు కొనసాగుతున్నాయి. సిరిసిల్ల తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట చేపట్టిన నిరసన దీక్షలు శుక్రవారానికి ఐదో రోజుకు చేరుకున్నాయి.  దీక్షకు వైఎస్‌ఆర్‌టీపీ జిల్లా అధ్య క్షుడు చొక్కాల రాము సంఘీభావం తెలిపారు. వీఆర్‌ఏల న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్‌  చేశారు. అంతకుముందు వీఆర్‌ఏలు నోటికి నల్ల గుడ్డలు కట్టుకొని నిరసన తెలిపారు. వైఎస్‌ఆర్‌టీపీ నాయ కులు లక్ష్మణ్‌, అనిల్‌, కరుణాకర్‌, సత్యం వంశీ, సంతోష్‌, శ్రీకాంత్‌, వీఆర్‌ఏల జేఏసీ కమిటీ కో కన్వీనర్‌ రాధాశంకర్‌, సిరిగిరి నవీన్‌, కొప్పు కవిత, కాసు చంద్రకళ పాల్గొన్నారు.

 ఇల్లంతకుంట:వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించాలని బీజే పీ మండల అధ్యక్షుడు బెంద్రం తిరుపతిరెడ్డి డిమాండ్‌ చేశా రు. మండలకేంద్రంలో కొనసాగుతున్న వీఆర్‌ఏల దీక్షలకు బీజేపీ నాయకులు శుక్రవారం సంఘీభావంప్రకటించారు. నాయకులు  తదితరులు పాల్గొన్నారు.

గంభీరావుపేట:వీఆర్‌ఏల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని బీఎస్‌పీ జిల్లా అధ్యక్షుడు చాకలి రమేష్‌ డిమాండ్‌ చేశారు. గంభీరావుపేట మండల కేంద్రంలో కొనసాగుతున్న వీఆర్‌ఏల నిరవదిక సమ్మెకు బీఎస్‌పీ నాయకులు శుక్రవారం సంపూర్ణ మద్దతు తెలిపారు. బీఎస్‌పీ మండల  కన్వీనర్‌ ఇరిగి పర్శరాములు, సీనియర్‌ నాయకులు వరదవెళ్లి స్వామిగౌడ్‌, రాజబాబు, దేవరాజు, బాలకిషన్‌, బాబు, దేవయ్య తదితరులు ఉన్నారు. 

ఎల్లారెడ్డిపేట: వీఆర్‌ఏల సమస్యలను సర్కారు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని టీఆర్‌ఎస్‌ ఎంపీపీ రేణుక అన్నారు. ఎల్లారెడ్డిపేట తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట చేపట్టిన వీఆర్‌ఏల దీక్ష దీక్ష శిబిరాన్ని శుక్రవారం ఆమె సందర్శించి సంఘీభావం తెలిపారు.   ఐదు రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వీఆర్‌ఏలు నోటికి నల్లగుడ్డలు కట్టుకొని వినూత్న నిరసన వ్యక్తం చేశారు.  వీఆర్‌ఏల సంఘం నాయకులు  తదితరులు పాల్గొన్నారు.

 వీర్నపల్లి :  మండల కేంద్రంలో వీఆర్‌ఏలు ఏర్పాటు చేసిన నిరవధిక సమ్మె దీక్షకు మద్దతుగా బీఎస్పీ నాయకులు, జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు శుక్రవారం మద్దతు తెలిపారు. బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు చాకలి రమేష్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి స్వామిగౌడ్‌, నియోజకవర్గ ఇన్‌చార్జి ఈసంపల్లి కొమురయ్య, పంచాయతీ కార్యదర్శులు  ఉన్నారు.

బోయినపల్లి: వీఆర్‌ఏల డిమాండ్‌ల పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్యం తగదని చొప్పదండి నియోజకవర్గం కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి మేడిపల్లి సత్యం అన్నారు. శుక్రవారం బోయినపల్లి తహసీల్దార్‌ కార్యాలయం ఆవరణంలో వీఆర్‌ఏల దీక్షకు మద్ద తు తెలిపారు.  బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు కూస రవీందర్‌, తడగొండ ఎంపీటీసీ శ్రీనివాస్‌గౌడ్‌, వన్నెల రమణారెడ్డి, మాజీ జడ్పీటీసీ పులి లక్ష్మీపతిగౌడ్‌, నాయకులు  ఉన్నారు. 

Updated Date - 2022-07-30T06:35:53+05:30 IST