హైకోర్టు ఉత్తర్వులు అమలు చేయాలని దీక్షలు

ABN , First Publish Date - 2021-01-26T05:58:42+05:30 IST

పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోని 1496 గిరిజన గ్రామాల ను షెడ్యూల్డ్‌ గిరిజన గ్రామాలుగా గుర్తిస్తూ ఉత్తర్వులను అమలు చేయాలని కోరుతూ రాష్ట్ర షెడ్యూల్డ్‌ ఏరియా ఆదివాసీ సంఘం అధ్యక్షు డు నిమ్మక సింహాచలం ఆధ్వర్యంలో సోమవారం రిలే దీక్షలు ప్రారంభించారు.

హైకోర్టు ఉత్తర్వులు అమలు చేయాలని దీక్షలు
రిలే దీక్ష చేస్తున్న గిరిజన నాయకులు

గుమ్మలక్ష్మీపురం, జనవరి 25: పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోని 1496 గిరిజన గ్రామాల ను షెడ్యూల్డ్‌ గిరిజన గ్రామాలుగా గుర్తిస్తూ ఉత్తర్వులను అమలు చేయాలని కోరుతూ రాష్ట్ర షెడ్యూల్డ్‌ ఏరియా ఆదివాసీ సంఘం అధ్యక్షు డు నిమ్మక సింహాచలం ఆధ్వర్యంలో సోమవారం రిలే దీక్షలు ప్రారంభించారు. కొత్తవలస గ్రామంలో ప్రారంభమైన ఈ రిలే దీక్ష కార్యక్రమంలో సింహాచలం మాట్లాడుతూ హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఈ గిరిజన గ్రామాలను షెడ్యూల్డ్‌ గ్రామాలుగా ఐటీడీఏ వెబ్‌సైట్‌లో చూపించాలని, యువతకు ఏజెన్సీ ఎస్టీ సర్టిఫికెట్లు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. ఐటీడీఏలో పనిచేస్తున్న గిరిజనేతర ఉద్యోగులను తొలగించి గిరిజనులచే భర్తీ చేయాలన్నారు. తమ సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఆదివాసీ నాయకులు, యువత, ప్రజల పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

 

 

Updated Date - 2021-01-26T05:58:42+05:30 IST