Abn logo
Oct 26 2021 @ 12:42PM

జమ్మూకశ్మీర్ టాక్సీ‌ స్టాండులో explosion..ఆరుగురికి గాయాలు

శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌‌లో మంగళవారం జరిగిన పేలుడులో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. బండిపొరా జిల్లా సుంబాల్ పట్టణంలోని సుమో టాక్సీస్టాండులో మంగళవారం పేలుడు సంభవించింది. భారత ఆర్మీ కాన్వాయ్ లక్ష్యంగా చేసుకొని పేలుడు జరిగింది. ఈ పేలుడులో ఓ మహిళతో సహా ఆరుగురు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని శ్రీనగర్ లోని ఎస్ఎంహెచ్ఎస్ ఆసుపత్రికి తరలించారు.ఈ పేలుడులో మహమ్మద్ అల్తాఫ్, ఫైజల్ ఫయాజ్, ముస్తాఖ్ అహ, తస్లీమా బానో, అబ్ హమీద్, ఫయాజ్ అహలు గాయపడ్డారు. క్షతగాత్రులకు వైద్యులు ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. పేలుడు అనంతరం అప్రమత్తమైన పోలీసులు సైనికులతో కలిసి ఉగ్రవాదుల కోసం గాలింపును ముమ్మరం చేశారు. 


ఇవి కూడా చదవండిImage Caption