రోడ్డు ప్రమాదంలో యువకునికి గాయాలు

ABN , First Publish Date - 2021-03-01T05:32:49+05:30 IST

పట్టణ శివారు జట్టు ఆశ్రమం వద్ద ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో కొమరాడ మండలానికి చెందిన యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.

రోడ్డు ప్రమాదంలో యువకునికి గాయాలు

బెలగాం, ఫిబ్రవరి 28: పట్టణ శివారు జట్టు ఆశ్రమం వద్ద ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో కొమరాడ మండలానికి చెందిన యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఏరియా ఆసుపత్రి ఔట్‌పోస్టు పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి. రావికోనవలసకు చెందిన చల్లా మహేష్‌ తన ద్విచక్ర వాహ నంతో పార్వతీపురం వెళుతుండగా, ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనం బలంగా ఢీకొనడంతో మహేష్‌ రోడ్డుపై పడి తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని 108లో ప్రాంతీయ ఆసుపత్రికి తరలించేసరికి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వై ద్యులు ప్రథమ చికిత్స అందించి ఉన్నత వైద్యం కోసం విశాఖపట్నం తరలిం చాల ని సూ చించారు. ఘటనపై కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 


Updated Date - 2021-03-01T05:32:49+05:30 IST