Abn logo
Jun 11 2021 @ 23:58PM

వైసీపీ పాలనలో దళితులకు అన్యాయం

రెల్లి హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు పాపారావు 


రోలుగుంట, జూన్‌ 11: వైసీపీ పాలనలో దళితులకు అన్యాయం జరుగుతున్నదని రెల్లి హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు యర్రంశెట్టి పాపారావు ఆవేదన వ్యక్తం చేశారు. మండల కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక దళితులకు న్యాయం జరుగుతుందని ఆశిస్తే, ఇప్పుడు 15 పథకాలను రద్దు చేసి నిరుపేద దళితులను రోడ్డున పడేశారని వాపోయారు. దళితుల పథకాలను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. అలాగే ఆక్రమణలో ఉన్న దళితుల భూములను తిరిగి వారికి అప్పగించాలని కోరారు. వైసీపీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా అభివృద్ధి మాత్రం శూన్యమన్నారు. సమావేశంలో సంఘం మండల అధ్యక్షుడు వడ్డాది అప్పలనాయుడు, కార్యదర్శి భూపతి, సభ్యుడు గోవిందు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement