నూతన పారిశ్రామిక విధానంతో దళితులకు అన్యాయం

ABN , First Publish Date - 2020-08-12T11:31:09+05:30 IST

ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి దళిత ద్రోహి అని కొండపి ఎమ్మెల్యే ఎమ్మెల్యే డాక్టర్‌ శ్రీబాలవీరాంజనేయ స్వామి ..

నూతన పారిశ్రామిక విధానంతో దళితులకు అన్యాయం

ఒంగోలు (కార్పొరేషన్‌) ఆగస్టు 11: ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి దళిత ద్రోహి అని కొండపి ఎమ్మెల్యే ఎమ్మెల్యే డాక్టర్‌ శ్రీబాలవీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ దళితుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన ఆయన అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. అయితే, ప్రభుత్వం ప్రవేశపె ట్టిన నూతన పారిశ్రామిక విధానంలో దళితులకు అన్యాయం చేస్తున్న విషయం తేటతెల్లమైందన్నారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం దళితల అభ్యున్నతికి కృషి చేయగా, వైసీపీ ప్రభుత్వం దళితులను అణగదొక్కే ప్రయత్నం చేస్తుందని పేర్కొన్నారు. 


దళితుల ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్న సీఎం

బడుగు, బలహీన వర్గాల అర్ధిక వ్యవస్థను దెబ్బతీసేలా ప్రభుత్వ పారిశ్రామిక విధానం ఉందని లిడ్‌ క్యాప్‌ మాజి ఛైర్మన్‌, గూడూరి ఎరిక్షన్‌ బాబు ఒక ప్రకటనలో విమర్శిఽంచారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఈజీ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో రాష్ట్రం మొదటి స్థానంలో ఉందన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.75 లక్షల వరకు సబ్సిడీ ఇస్తే, నేడు వైసీపీ ప్రభుత్వం రూ. 50 లక్షలకు కుదించిందన్నారు. ప్రభుత్వం వెంటనే నూతన పారిశ్రామిక పాలసీని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. 


టీడీపీ హయాంలోనే జిల్లా అభివృద్ధి

టీడీపీ హయాంలోనే జిల్లాలో అభివృద్ధి జరిగిందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్ధన్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకా శం యూనివర్సిటీ, డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం ట్రిపుల్‌ ఐటి, హార్టి కల్చర్‌ కాలే జి, రామాయపట్నం పోర్టుకు శంకుస్థాపన జరిగిందన్నారు.  వైసీపీ ప్రభుత్వం చ్చిన 14 నెలలైనా రామాయపట్నం పోర్టును గాలికి వదిలేశారన్నారు.  దొనకొం డలో ఇండస్ట్రీయల్‌ హబ్‌, దొనకొండ ఎయిర్‌ పోర్టు గాలికొదిలేశారని ఆయన విమర్శించారు. 


అన్ని రంగాలను అభివృద్ధి చేసిన ఘనత టీడీపీదే 

కనిగిరి, ఆగస్టు 11: జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత టీడీపీదేనని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి ఒక ప్రకటన లో పేర్కొన్నారు. చేనేత కార్మికులను ఆదుకునేందుకు రూ.111 కోట్లకు పైగా రు ణాలు మాఫీ చేసినట్లు తెలిపారు. సంప్రదాయ మగ్గాల స్థానంలో ఆధునిక మగ్గాలను అందించి చేనేతల అభివృద్ధికి మాజీ సీఎం చంద్రబాబు పెద్ద పీటవే శారని వివరించారు. అప్పటి టీడీపీ ప్రభుత్వం ముందు చూపుతో వ్యవహ రించడం వల్లే అభివృద్ధిలో జిల్లా ప్రకాశించిందని ఆయన పేర్కొన్నారు. 

Updated Date - 2020-08-12T11:31:09+05:30 IST