నేతన్న నేస్తంలో అర్హులకు అన్యాయం

ABN , First Publish Date - 2021-08-03T06:35:02+05:30 IST

నేతన్ననేస్తం పథకంలో అర్హులైన చేనేత కార్మికులకు అన్యాయం జరుగుతోందని చేనేత ఐక్యవేదిక నాయకుడు నాగరాజు అన్నారు. సోమవారం ఎంపీడీవో కార్యాలయం ఎదుట అర్హులైన చేనేత కార్మికులందరికీ నేతన్న నేస్తం ఇవ్వాలని కోరుతూ నిరసన కార్యక్రమం నిర్వహించారు.

నేతన్న నేస్తంలో అర్హులకు అన్యాయం
ఎంపీడీవో కార్యాలయం ఎదుట నిరసన చేస్తున్న చేనేత ఐక్యవేదిక నాయకుడు నాగరాజు

మదనపల్లె రూరల్‌, ఆగష్టు 2:  నేతన్ననేస్తం పథకంలో అర్హులైన చేనేత కార్మికులకు అన్యాయం జరుగుతోందని చేనేత ఐక్యవేదిక నాయకుడు నాగరాజు అన్నారు. సోమవారం ఎంపీడీవో కార్యాలయం ఎదుట అర్హులైన చేనేత కార్మికులందరికీ నేతన్న నేస్తం ఇవ్వాలని కోరుతూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వివిధ రకాల సంక్షేమ పథకాలు అందుతున్నాయనే కారణంతో జాబితా నుంచి తొలగించారన్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించి అర్హులైన ప్రతిఒక్కరికి నేతన్ననేస్తం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో వెంకటరమణ, శ్రీనివాసులు, రామ్మూర్తి, వెంకటేష్‌, మోహన్‌రెడ్డి, శంకర్‌యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-03T06:35:02+05:30 IST