లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ABN , First Publish Date - 2021-07-23T05:58:00+05:30 IST

జిల్లా వ్యాప్తంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు.

లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌

- అధికారులు అందుబాటులో ఉండాలి

- వరదలు, వర్షంపై అధికారులతో కలెక్టర్‌ సమీక్ష

ఆసిఫాబాద్‌, జూలై 22: జిల్లా వ్యాప్తంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. మరో మూడురోజులు వర్షాలు కొనసాగుతాయని వాతావరణశాఖ హెచ్చరికల నేప థ్యంలో గురువారం కలెక్టరేట్‌లో అన్నిశాఖల అధి కారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరో మూడు రోజులపాటు వర్షాలు కొనసాగుతాయని అన్నారు. లోతట్టుప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల న్నారు. వర్షాలుకొనసాగుతున్న నేపథ్యంలో అధికా రులు అంతా స్థానికంగా అందుబాటులో ఉండాలని అన్నారు. జలపాతాలవద్దకు పర్యాటకులు వెళ్లకుండా చూడాలని అటవీఅధికారులకు తెలిపారు. మారు మూల ప్రాంతాల్లో ఉన్నగర్భిణులను గుర్తించి వారిని హెడ్‌క్వార్టర్స్‌లో ఉంచాలని వైద్యాధికారులకు తెలి పారు. జిల్లాలో విద్యుత్‌ సమస్యను ఎప్పటికప్పుడు తీర్చాలన్నారు. జిల్లా కేంద్రంలోని కంటకాలనీ, పైకాజీ నగర్‌, రాజంపేట కాలనీలు వరదకు గురయ్యాని వాటిని తొలించాలని అగ్నిమాపక సిబ్బందిని ఆదేశిం చారు. జిల్లా అధికారుల సెలవులు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. చెరువులవద్ద జాలర్లను ప్రత్యేక టీంలుగా ఏర్పాటు చేసి ఎవరూ వెళ్లకుండా చూడాలన్నారు. జిల్లాలో వరదప్రాంతాల్లో సహాయంకోసం ప్రత్యేకటో ల్‌ఫ్రీ నంబర్‌తోపాటు కంట్రోల్‌రూం ఏర్పాటు చేయ నున్నట్లు తెలిపారు. అంతకుముందు జిల్లా కేంద్రం లోని వరదప్రాంతాలను సందర్శించారు. కార్యక్ర మంలో అదనపు కలెక్టర్‌ రాజేశం, ఎస్‌పీ వైవీఎస్‌ సుదీంద్ర, జిల్లాఅటవీఅధికారిశాంతారాం, అన్నిశాఖల అధికారులు పాల్గొన్నారు. 

జిల్లాలో టోల్‌ ఫ్రీ నెంబర్‌ ఏర్పాటు..

జిల్లాలో మరో మూడు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో కంట్రోల్‌రూం, టోల్‌ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేశారు. ప్రజలకు ఏమైనా అసౌకర్యం కలిగేతే కంట్రోల్‌ రూం నెం.8790256720 నంబర్‌కు కాల్‌ చేయాలని కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌ తెలిపారు.

Updated Date - 2021-07-23T05:58:00+05:30 IST