కరోనా కరుణ.. గల్ఫ్‌లో ఖైదీల విడుదల

ABN , First Publish Date - 2020-04-09T10:03:54+05:30 IST

కరోనా మహమ్మారి వ్యాప్తి నిర్మూలనలో భాగంగా జైళ్లలో మగ్గుతున్న ఖైదీలను గల్ఫ్‌ దేశాలు విడుదల చేస్తున్నాయి. ఒమన్‌లోని వివిధ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న 599 మంది ఖైదీలను విడుదల చేస్తూ ఒమన్‌ సుల్తాన్‌ షేక్‌ హైతం

కరోనా కరుణ.. గల్ఫ్‌లో ఖైదీల విడుదల

ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి: కరోనా మహమ్మారి వ్యాప్తి నిర్మూలనలో భాగంగా జైళ్లలో మగ్గుతున్న ఖైదీలను గల్ఫ్‌ దేశాలు విడుదల చేస్తున్నాయి. ఒమన్‌లోని వివిధ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న 599 మంది ఖైదీలను విడుదల చేస్తూ ఒమన్‌ సుల్తాన్‌ షేక్‌ హైతం బిన్‌ తారిఖ్‌ బుధవారం హుకుం జారీ చేశారు. ఇందులో 366 మంది విదేశీ ఖైదీలుండగా.. వారిలో భారతీయులు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నారని భావిస్తున్నారు. అదేవిధంగా సౌదీ అరేబియా కూడా 250 మంది విదేశీ ఖైదీలను విడుదల చేసింది. మిగిలిన గల్ఫ్‌ దేశాలు కూడా కరోనా కారణాన ఖైదీలను విడుదల చేస్తున్నాయి. వీసా నేరాలపై పట్టుబడిన కొంత మంది తెలుగు ప్రవాసీలను దుబాయి, షార్జా పోలీసులు ఉదారంగా వదిలేశారు.

Updated Date - 2020-04-09T10:03:54+05:30 IST