Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఇన్నోవా ఢీకొని గొర్రెలు మృతి

కరీంనగర్: జిల్లాలోని వీణవంక మండలం లోని కర్కల్ గ్రామంలో బీజేపీ కళాకారుల ఇన్నోవా వాహనం ఢీకొని 25 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. గంప రాములు అనే వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం రాములును ఆస్పత్రికి తరలించారు. గొర్రెలపైకి దూసుకెళ్లిన ఇన్నోవా వాహనం ఆపకుండా మూడు కిలోమీటర్ల దూరం వెళ్లింది. దీంతో ఆ వాహనాన్ని వెంబడించి స్థానికులు పట్టుకున్నారు. వీణవంక పోలీస్ స్టేషన్‌లో బాధితుడు ఫిర్యాదు చేసాడు. పోలీసుల అదుపులో ఇన్నోవా వాహనం డ్రైవర్ ఉన్నారు. 

Advertisement
Advertisement