వినూత్న మార్పులతో...

ABN , First Publish Date - 2020-07-08T08:19:41+05:30 IST

ఇప్పుడున్న పరిస్థితులకు తగ్గట్టుగానే కొవిడ్‌-19 నిబంధనలు పాటిస్తూ ఈ సిరీస్‌ జరుగబోతోంది. ఈనేపథ్యంలో క్రికెట్‌ మ్యాచ్‌ల్లో తీసుకునే జాగ్రత్తలపై ...

వినూత్న మార్పులతో...

ఇప్పుడున్న పరిస్థితులకు తగ్గట్టుగానే కొవిడ్‌-19 నిబంధనలు పాటిస్తూ ఈ సిరీస్‌ జరుగబోతోంది. ఈనేపథ్యంలో క్రికెట్‌ మ్యాచ్‌ల్లో తీసుకునే జాగ్రత్తలపై ఇదివరకే ఐసీసీ ఆమోదముద్ర వేసింది. దీంతో ఇంతకుముందెన్నడూ చూడని సన్నివేశాలు ఈ సిరీస్‌ ద్వారా మనకు కనిపించనున్నాయి. అవేంటో ఓసారి లుక్కేద్దాం..

బయో సెక్యూర్‌లో..: మైదానంలో అడుగుపెట్టడానికి ముందే ఆటగాళ్లందరికీ థర్మల్‌ స్ర్కీనిం గ్‌ ద్వారా పరీక్షలు, కిట్‌లపై శానిటైజేషన్‌ తప్పనిసరి. హోటళ్లలో డోర్లు కీ ద్వారా కాకుండా ఫోన్‌ యాప్‌ ద్వారా తెరుచుకునేలా ఈసీబీ జాగ్రత్త తీసుకుంది. వికెట్లు పడినప్పుడు ఆటగాళ్లు హైఫైవ్స్‌ కా కుండా మోచేయి ద్వారా సంతోషాన్ని వ్యక్తపరుస్తారు.

ప్రేక్షకుల్లేకుండానే..:  స్టేడియాల్లో అభిమానులకు అనుమతి లేదు. దీంతో ఖాళీ కుర్చీల సమక్షంలోనే ఇరు జట్లు తమ ఆటను ప్రదర్శించాల్సి ఉంటుంది.

ఉమ్మికి దూరంగా..: కరోనా వైరస్‌ ఉధృతికి లాలాజలం కారణమవుతుందనే ఆలోచనతో బౌలర్లు ఇక బంతికి ఉమ్మిని పూయరాదని ఐసీసీ తేల్చింది. ఇదే ఇప్పుడు అత్యంత ఆసక్తిదాయకంగా మారింది. అండర్సన్‌, కీమర్‌ రోచ్‌ స్వింగ్‌ బంతులతో కట్టడిచేయగలరు. ఇప్పుడు వీరి బౌలింగ్‌ ఎలా ఉండబోతోందో చూడాలి. బౌలర్‌ పొరపాటున బంతికి ఉమ్మి పూసినా రెండుసార్లు హెచ్చరికతో సరిపుచ్చుతారు. కానీ మరోసారి పునరావృతమైతే బ్యాటింగ్‌ జట్టుకు ఐదు పరుగులను కోల్పోవాల్సిందే. 

కరోనా సబ్‌స్టిట్యూట్‌: ఏ ఆటగాడికైనా  మ్యాచ్‌ మధ్యలో కరోనా లక్షణాలు కనిపిస్తే అతడి స్థానంలో మరో ఆటగాడిని అనుమతిస్తారు. 

స్థానిక అంపైర్లు: అంతర్జాతీయంగా ప్రయాణ ఆంక్షలుండడంతో ద్వైపాక్షిక సిరీ్‌సలలో స్థానిక అంపైర్లు విఽధులు నిర్వర్తిస్తారు. 

అదనపు రివ్యూలు: ఇరు జట్లకు ప్రతీ ఇన్నింగ్స్‌లో అదనంగా మరో డీఆర్‌ఎస్‌ రివ్యూను అనుమతించారు. దీంతో టెస్టుల్లో ఈ సంఖ్య మూ డుకు చేరగా వన్డేల్లో రెండు అవకాశాలుంటాయి.

Updated Date - 2020-07-08T08:19:41+05:30 IST