కోతులను తరిమికొట్టేందుకు రైల్వే అధికారుల వినూత్న ఐడియా.. వాటెన్ ఐడియా సర్‌జీ అంటున్న నెటిజన్లు..

ABN , First Publish Date - 2021-11-01T03:10:52+05:30 IST

లక్నోలోని మెట్రో స్టేషన్‌లలో కోతుల బెడదతో ప్రయాణికులు, అధికారులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ప్రయాణికుల వస్తువులను ఎత్తుకెళ్లడం, చిన్నపిల్లలపై దాడులు చేయడం వంటివి చేస్తుండేవి. దీంతో ప్రయాణికులు, స్థానికుల నుంచి రోజూ ఫిర్యాదులు వస్తుండేవి.

కోతులను తరిమికొట్టేందుకు రైల్వే అధికారుల వినూత్న ఐడియా.. వాటెన్ ఐడియా సర్‌జీ అంటున్న నెటిజన్లు..

కోతులను అడవిలో చూస్తే బాగుంటుంది కానీ.. ఇళ్ల మధ్యలో చూస్తే చిరాకు పుడుతుంది. ఎప్పుడు ఎలా దాడి చేస్తాయో, ఏ వస్తువులను ఎత్తుకెళ్తాయో తెలీదు. దీంతో చాలా మంది కోతుల బెడద కారణంగా ఇబ్బందులు పడుతుంటారు. లక్నోలోని మెట్రో స్టేషన్ అధికారులు కూడా ఇలాగే ఇబ్బంది పడేవారు. అయితే చివరకు వినూత్నంగా ఆలోచించి వాటిని సింపుల్‌గా తరిమికొట్టారు. వివరాల్లోకి వెళితే..


లక్నోలోని మెట్రో స్టేషన్‌లలో కోతుల బెడదతో ప్రయాణికులు, అధికారులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ప్రయాణికుల వస్తువులను ఎత్తుకెళ్లడం, చిన్నపిల్లలపై దాడులు చేయడం వంటివి చేస్తుండేవి. దీంతో ప్రయాణికులు, స్థానికుల నుంచి రోజూ ఫిర్యాదులు వస్తుండేవి. దీంతో పాటు అధికారులు కూడా కోతుల కారణంగా అవస్థలు పడేవారు. దీనికి తోడు చాలా కోతులు ఎగిరి, దుంకే క్రమంలో రైళ్ల కింద పడి చనిపోయేవి. ఎంత తరిమికొట్టినా మళ్లీ మళ్లీ వస్తుండడంతో అధికారులు తలలు పట్టుకునేవారు. అయితే ఓ రోజు వారికి ఒక ఆలోచన వచ్చింది. కొండముచ్చుకు సంబంధించిన వాయిస్‌ను మైకు ద్వారా ప్లే చేశారు. దీంతో కోతులన్నీ భయపడి పారిపోయేవి.


అయితే వారి ఐడియా కొన్నాళ్లే పని చేసింది. రోజూ ఆ వాయిస్‌కు అలవాటు పడ్డ కోతులు, విషయం తెలిసిపోయినట్లుగా.. మళ్లీ రావడం మొదలెట్టాయి. దీంతో అధికారులకు మళ్లీ తలనొప్పులు మొదలయ్యాయి. చివరకు వారంతా కలిసి కొండముచ్చుల ఫొటోలను ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించారు. వెంటనే చాలా కటౌట్లను తెప్పించి ఏర్పాటు చేశారు. రెండో సారి వారి ప్రయత్నం ఫలించింది. కొండముచ్చు ఫొటోలను చూసిన కోతులు పరుగు లంగించుకోవడం మొదలెట్టాయి. అటువైపు రావడానికి కూడా భయపడుతున్నాయి. ఎట్టకేలకు సమస్య పరిష్కారమవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.



Updated Date - 2021-11-01T03:10:52+05:30 IST