Abn logo
Apr 9 2021 @ 00:41AM

వినూత్న ప్రేమకథ

నవీన్‌చంద్ర హీరోగా వినూత్న కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘నేను లేని నా ప్రేమకథ’. సురేష్‌ ఉత్తరాది దర్శకుడు. కల్యాణ్‌ కందుకూరి, దుర్గాప్రసాద్‌రెడ్డి, ఎ. భాస్కరరావు నిర్మాతలు. త్వరలో టీజర్‌, పాటలు విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా కల్యాణ్‌ కందుకూరి మాట్లాడుతూ ‘‘దర్శకుడు సినిమాను మంచి క్వాలిటీతో తెరకెక్కించాడు. పాటలు ఆకట్టుకునేలా ఉంటాయి. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’అని చెప్పారు. గాయత్రి ఆర్‌. సురేష్‌, రాజారవీంద్ర తదితరులు నటించిన ఈ చిత్రానికి జువెన్‌సింగ్‌ సంగీతం అందించారు.


Advertisement
Advertisement
Advertisement