Abn logo
Dec 4 2020 @ 00:58AM

విద్యాశాఖ వినూత్న విధానం

దిలావర్‌పూర్‌ మండలం సిర్గాపూర్‌ ప్రభుత్వ జడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలలో ప్రహరీ గోడ నిర్మాణం పనులు చేపడుతున్న దృశ్యం

ఆలోచనకు జిల్లా విద్యాశాఖ శ్రీకారం

పూర్వ విద్యార్థులను ఏకం చేస్తూ ముందుకు సాగుతున్న వైనం

ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చేసే దిశగా కొత్త అడుగులు

పూర్వవిద్యార్థుల సహకారంతో పాఠశాలల అభివృద్ధి

నిర్మల్‌, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి) : జిల్లా విద్యాశాఖ వినూత్న ఆలోచనలకు శ్రీకారం చుట్టింది. మారుతున్న సమాజంలో రోజురోజుకూ పెరిగిపోతున్న టెక్నాలజీ కార్పొ రేట్‌ విద్యాసంస్థలు ఓవైపు దూసుకుపోతున్న దశలో ప్రభుత్వ పాఠశాలలు వారి వేగాన్ని అందుకోలేకపోతు న్నాయని విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు మౌలిక వసతుల కల్పనలో విద్యాశాఖ ఆశించిన స్థాయిలో ప్రజల మన్ననలు పొందలేకపోయింది. ఈ దశలోనే తెలంగాణ ప్రభుత్వం నూతన విధానంలో విద్యాబోధన లాంటి అంశాలపై ఇది వరకే దృష్టి సారించింది. విద్యారంగంలో ఎన్నో సంస్క రణలు చేపట్టింది. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి ప్రభుత్వ విద్యను మరింత బలోపేతం చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో కార్పోరేట్‌, పైవేట్‌ విద్యాసంస్థల వైపు ఆకర్షితులైన విద్యార్థులంతా తిరిగి గురుకులాల్లో చదివేందుకు ఆసక్తి చూపుతున్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను గురుకులాల్లో చదివించేందుకు ముందుకు వస్తున్నారు. ప్రైవేట్‌రంగంలో అధికఫీజులు తమకు తలకు మించిన భారంగా మారుతున్నాయని గురుకులాల్లో తమ పిల్లలకు ప్రైవేట్‌స్థాయి విద్య అందుబాటులోకి రావడం శుభ పరిణామంగా భావించి గురుకుల వైపు అడుగులు వేస్తు న్నారు. ఓవైపు గురుకుల పాఠశాలల్లో చదివేందుకు విద్యా ర్థులు ఆసక్తి చూపుతున్న తరుణంలోనే ఒక సమయంలో ప్రతి పల్లెలో ఉన్న ప్రజలను చైతన్యవంతులను చేస్తూ విద్యాబుద్ధులు నేర్పి నిరాక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చి దిద్దిన పాఠశాలలు మాత్రం ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉన్నా యి. క్షేత్ర స్థాయిలో శిశు నుండి ఐదవ తరగతి వరకు ఉండే ప్రాథమిక పాఠశాలలు, ఐదవ తరగతి నుండి ఏడవ తరగతి వరకు ఉండే ప్రాథమికోన్నత పాఠశాలలు, ఎనిమిదో తరగతి నుండి పదవ తరగతి వరకు విద్యను అభ్యసించే అవకాశం ఉన్నా ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సంఖ్య నానాటికి తగ్గిపోతోంది. దీనికి ప్రధాన కారణాలు కొన్నిచోట్ల సరిపడా ఉపాధ్యాయులు లేకపోవడం ఒకటైతే మరికొన్ని చోట్ల పాఠశాలల్లో కనీస వసతులు లేకపోవడం మరొకటి. ఈ దశలో నానాటికీ ప్రజల్లో ఆదరణ తగ్గుతున్న ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలను అభివృద్ధి చేసేందుకు పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు మౌలిక వసతు లను కల్పించేందుకు నిర్మల్‌ జిల్లా విద్యాశాఖ వినూత్న ఆలోచన చేసింది. ఈ ఆలోచనతో ప్రభుత్వ పాఠశాలలు ఒక్కొక్కటిగా అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నాయి. నిర్మ ల్‌ జిల్లా విద్యాశాఖ ఇచ్చిన పిలుపుకు అపూర్వస్పందన లభిస్తుంది. పూర్వ విద్యార్థుల నుండి తమ తమ పాఠశా లలకు ఎవరికి తోచిన చేయూతను వారు అందించేలా చేసింది. పూర్వ విద్యార్థులను ఏకం చేస్తూ పాఠశాల అభి వృద్ధికై శ్రీకారం చుట్టిన నిర్మల్‌ జిల్లా విద్యాశాఖ పలువురి మన్ననలు పొందుతోంది. ఈ విధానం అద్భుత ఫలితాలను ఇస్తూ పాఠశాలలను అభివృద్ధి వైపు అడుగులు వేస్తే నిర్మల్‌ జిల్లా రాష్ర్టానికే ఆదర్శంగా నిలువనుంది.

పాఠశాలల అభివృద్ధికై వినూత్న విధానం

ప్రస్తుతం మౌళిక వసతులు లేక ఇబ్బందుల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం నుండి మాత్రమే వచ్చే నిధులపై ఆధారపడకుండా నిర్మల్‌ జిల్లా విద్యాశాఖ వినూత్న ఆలోచన చేసింది. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో విద్యార్థులను భాగం చేయాలని ఇందుకోసం ఆయా గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులకు నిర్మల్‌ జిల్లా విద్యాశాఖ మార్గ దర్శకాలను జారీ చేసింది. ప్రతి ఉపాధ్యాయుడు తమ తమ పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థులను కలవాలని ఆదేశాలు జారీ చేసింది. తమ పాఠశాలలో చదివి ప్రస్తుత సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తుల ద్వారా తమ పాఠశాల అభివృద్ధికి తోచిన సహకారం అందించాలని కోరా లని నిర్ణయించింది. దాతలు ఇచ్చే విరాళాల తాలూకు వివ రాలను జిల్లా విద్యాశాఖ వెబ్‌సైట్‌లో ఎప్పటికప్పుడు అప్లో డ్‌ చేయాలని నిర్ణయించుకుంది. ధన రూపంలో కాకుండా వస్తు రూపంలో ఈ విరాళాల సేకరణ ఉండేలా జాగ్రత్తలు పాటిస్తుంది. ఎక్కడ కూడా విరాళాల దుర్వినియోగం జరగకుండా ఈ గ్రామానికి చెందిన పాఠశాల పూర్వ విద్యార్థి ఎంత విరాళం ఇచ్చారో ఏ వస్తువును విరాళంగా ఇచ్చారో అనే వివరాలను ఫోటోలతో యుక్తంగా ఆన్‌లైన్‌లో అప్లోడ్‌ చేయనున్నారు. దాతలు విరాళం ఇవ్వక ముందు ఉన్న పరిస్థితిని ఆ విరాళం ఇచ్చిన తర్వాత పాఠశాలలో వచ్చిన మార్పును కనిపించేలా ఫోటోలను తీసి ఆన్‌లైన్‌లో అప్లోడ్‌ చేయనున్నారు. దాతలు ఇచ్చే విరాళాలపై పార దర్శకత పాటించాలని ఎప్పటికప్పుడు వివరాలను ఆన్‌ లైన్‌లో పొందుపరచాలని జిల్లా విద్యాశాఖ మార్గ దర్శకాలను జారీ చేసింది. పూర్వ విద్యార్థులు కాకుండా గ్రామాల్లో ఉన్న ప్రజా ప్రతినిధులు ఇతరత్రా వ్యక్తులు ఎవరైనా పాఠశాల అభివృద్ధికి తోడ్పాటును అందించేలా ఉపాధ్యాయులు వారిని కలిసి తాము చేపట్టిన కార్యక్రమా న్ని వివరించాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.

గురువుల పిలుపుతో 

తమతమ బడులకు చేయూత

జిల్లా విద్యాశాఖ చేపట్టిన వినూత్న విధానం సత్ఫ లితాలను ఇస్తుంది. జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయులు ఆయా గ్రామాల్లో పూర్వ విద్యార్థులను కలుస్తూ పాఠశాల అభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాల్లో తమవంతు సహ కారం అందించాలని చేస్తున్న విన్నపాలను అపూర్వ స్పంద న లభిస్తోంది. ఇదివరకే జిల్లాలో పలు గ్రామాల ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసించిన పూర్వ విద్యార్థులు తమతమ పాఠశాలను అభివృద్ధి చేసేందుకు తనవంతు సహకారం అందిస్తున్నారు. ఈ క్రమంలో జిల్లాకు చెందిన ప్రముఖ న్యాయవాది తాను చదివిన బడికి రూ.ఐదు లక్షల విరాళం అందజేసి తమ గ్రామ ప్రజల మన్ననలు పొందుతున్నారు. హైకోర్టు అడ్వకేట్‌గా విధులు నిర్వహిస్తున్న దిలావర్‌ పూర్‌ మండలం సిర్గాపూర్‌ గ్రామానికి చెందిన నిరం జన్‌రెడ్డి తన గ్రామంలో చిన్ననాడు తనకు విద్యా బుద్ధులు నేర్పి నేడు ఈ స్థాయికి ఎదిగేందుకు పునాది వేసిన పాఠశాలను అభివృద్ధి చేసేందుకు ముందుకు వచ్చారు. పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు జిల్లా విద్యా శాఖ చేపట్టిన విధానాన్ని నిరంజన్‌ రెడ్డి వివరించడంతో తక్షణమే స్పందించిన ఆయన పాఠశాల అభివృద్ధి కోసం ప్రహరీగోడ నిర్మాణానికి సొంతంగా ఐదు లక్షల రూపాయలను విరాళంగా అందజేసేందుకు ముందుకు వచ్చారు. అదే విధంగా జిల్లాలోని లోకేశ్వరం మండల కేంద్రానికి చెందిన జెడ్‌పిహెచ్‌ఎస్‌ పాఠశాలను అభివృద్ధి చేసేందుకు సహ కారం అందించాల్సిందిగా ఆ పాఠశాల ఉపాధ్యాయులు ప్రజాప్రతినిధులను పూర్వ విద్యార్థులను కోరడంతో ఇక్కడ కూడా విశేషస్పందన లభించింది. పలువురు దాతలు ముందుకు వచ్చి ఎవరికి తోచిన సహాయాన్ని వారు అంద జేశారు. పాఠశాల అభివృద్ధి కోసం లోకేశ్వరం సబ్‌ ఇన్స్‌పెక్టర్‌ పది ట్రాక్టర్ల మొరం, మూడు ట్రాక్టర్ల ఇసుకను విరాళంగా అందజేశారు. పీఏసీఎస్‌ చైర్మన్‌ రామచంద్ర రావు పది బస్తాల సిమెంట్‌ను, ఆ గ్రామానికి చెందిన మరింత మంది నాయకులు, పూర్వ విద్యార్థులు ముత్తా గౌడ్‌ వెయ్యి రూపాయలు, వెంకటరమణ టీచర్‌ రెండు వేల రూపాయలు, హరీష్‌ అనే వ్యాపారి రెండు వేల రూపాయలు పాఠశాల ప్రహరీగోడ నిర్మాణానికి విరాళంగా అందజేశారు. ఇలా పలు ప్రాంతాలలో ప్రభుత్వ పాఠ శాలల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు దాతలు విరాళాలు ఇచ్చేందుకు ముందుకు వస్తుండటంతో నిర్మల్‌ జిల్లా విద్యా శాఖ చేపట్టిన కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తోంది.

విద్యారంగానికి ఉపయోగపడే 

ప్రతి వస్తువును విరాళంగా ఇవ్వచ్చు

విద్యార్థులకు ఉపయోగపడే ప్రతి వస్తువుని విరాళంగా అందజేయవచ్చని విద్యాశాఖ చెబుతోంది. విద్యార్థులకు ఉపయోగపడే బెంచీలు, కుర్చీలు, షూలు, యూనిఫామ్స్‌, పెన్నులు, నోట్‌ పుస్తకాలు, డిజిటల్‌ విద్యావిధానానికి ఉప యోగపడే ఎలక్ర్టానిక్‌ వస్తువులు, టాయిలెట్స్‌ లేనిచోట వాటి నిర్మాణానికి ఉపయోగపడే సామాగ్రి, ప్రహరీ గోడలు లేని చోట వాటి నిర్మాణానికి ఉపయోగపడే సామాగ్రి, విద్యార్థులకు అందజేసే ఆయా రకాల పౌష్టికాహరం ఇలాంటివి ఎన్నో రకాల వస్తువులను దాతలు అంద జేయవచ్చని విద్యాశాఖ స్పష్టం చేస్తోంది. నిర్మాణ రంగంలో ఉన్న ఇంజనీర్‌ లాంటివాళ్లు పాఠశాల నిర్మాణాలకు ఉపయోగపడాలని వైద్యరంగంలో ఉన్న వ్యక్తులు పాఠ శాలలో చదువుతున్న విద్యార్థులకు ఉచిత వైద్యం అందజేయడం ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం తదితర సేవా కార్యక్రమాలు అన్నింటిని ఈ కార్యక్రమంలో భాగంగా దాతలు చేపట్టేలా నిర్మల్‌ జిల్లా విద్యాశాఖ కోరుతోంది. ప్రభుత్వ పాఠశాలల బలోపేతంలో అందరిని భాగస్వామ్యం చేసేందుకు శ్రమిస్తోంది. ఇందుకోసం ప్రతి ఒక్కరూ సహకరించాల్సిందిగా ఉపాధ్యాయుల ద్వారా జిల్లా విద్యాశాఖ దాతలకు లేఖలను అందజేస్తోంది. పాఠశాలల్లో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న అత్యంత నిరుపేద విద్యార్థులను మొట్టమొదటగా ఎంపిక చేసుకొని వారికి దాతల నుండి వచ్చిన విరాళాలు ఉపయోగపడేలా చర్యలు చేపడతామని విద్యాశాఖ స్పష్టం చేస్తోంది. దాతలు అందజేసిన విరాళాలసై పారదర్శకత పాటిస్తామని ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేసేందుకు సహ కారం చేయాలని జిల్లా విద్యాశాఖ కోరుతోంది.

Advertisement
Advertisement