Abn logo
Jul 7 2020 @ 05:21AM

వరి ధాన్యం కొనుగోళ్ల అక్రమాలపై విచారణ జరపాలి

మెట్‌పల్లిలో వెల్లుల్ల రైతుల నిరసన 


మెట్‌పల్లి, జూలై 6: రబీ సీజన్‌ వరి ధాన్యం కొనుగోళ్లలో చోటుచేసుకున్న అక్రమాలపై విచారణ జరిపి రైతులకు పరిహారం అందించాలని డిమాండ్‌ చేస్తూ మండలంలోని వెల్లుల్ల గ్రామానికి చెందిన పలువురు రైతులు మెట్‌పల్లిలో ఆందోళన చేశారు. సోమవారం మెట్‌పల్లికి వచ్చిన రైతులు జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించారు. అనంతరం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వద్ద బైఠాయించారు. అధికారులకు వినతిపత్రం సమర్పించారు.


ఈ సందర్బంగా పలువురు రైతు సంఘ నాయకులు మాట్లాడారు. రబీ ధాన్యం సహకార సంఘాల ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేసిందన్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఒక్కో 40 కేజీల బస్తాకు సుమారు 4 నుంచి 5 కిలోల వరకు తప్ప, తరుగు పేరిట కోతలు విధించారన్నారు. దీంతో రైతులు నష్టపోయారన్నారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు విచారణ జరిపి రైతులకు పరిహారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో వెల్లుల్ల రైతు సంఘ నాయకులు కంతి హరికుమార్‌, సార్ల శ్రీనివాస్‌, పన్నాల నర్సారెడ్డి, గోపిడి రాజయ్య, సార్ల రాజేశ్‌, మహిపాల్‌ రెడ్డి, నాగరాజు, పన్నాల రాజు, బీర్కుల రాజం తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement