ఎమ్మెల్యే ఆదేశం మేరకు విచారణ

ABN , First Publish Date - 2021-10-22T05:27:43+05:30 IST

ఎమ్మెల్యే ఆదేశం మేరకు విచారణ

ఎమ్మెల్యే ఆదేశం మేరకు విచారణ
రైతులతో వివరాలు తెలుసుకుంటున్న అధికారులు

యాచారం: మొండిగౌరెల్లిలో అక్రమ మైనింగ్‌కు అనుతించొద్దని ఇటీవల ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి అధికారులకు, ప్రభుత్వానికి లేఖ రాశారు. గురువారం మైనింగ్‌ అధికారులు వచ్చి క్రషర్లతో కలుగుతున్న నష్టాలపై రైతులనడిగి వివరాలు తెలుసుకున్నారు. మైనింగ్‌ ఏడీ సత్యనారాయణ, సర్వేయర్‌ లక్ష్మీనారాయణ క్షేత్రస్థాయిలో విచారణ చేశారు. 19 సర్వే నెంబర్‌లో 680ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, దీనికి ఆనుకొని 38, 39, 40సర్వే నెంబర్లలో పట్టాభూములున్నాయని రైతులు తెలిపారు. క్రషర్లు బిగిస్తే భూములు సాగుకు పనికిరాకుండా పోయి వందలాది మంది రైతులు, కూలీలకు ఉపాధి లేకుండపోతుందని వివరించారు. భూగర్భజలం పూర్తిగా పడిపోతుందన్నారు. ఇక్కడ క్రషర్లు పెట్టొద్దని ప్రజాభిప్రాయం మేరకే ఎమ్మెల్యే చెప్పినా మల్లా విచారణ ఎందుకని రైతులు అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. తాము మైనింగ్‌కు వ్యతిరేకమని రైతులు తెగేసి చెప్పడంతో అధికారులు వెనుదిరిగారు.

Updated Date - 2021-10-22T05:27:43+05:30 IST