భూసేకరణ అక్రమాలపై విచారణ

ABN , First Publish Date - 2020-10-23T11:46:08+05:30 IST

మండల పరిధిలోని కొత్తపల్లె గ్రామ పంచాయతీలో భూసేకరణ అక్రమాల ఫిర్యాదుపై స్థానిక తహసీల్దారు కార్యా లయంలో గురువారం విచారణ మొదలైంది.

భూసేకరణ అక్రమాలపై విచారణ

ప్రొద్దుటూరు రూరల్‌, అక్టోబరు 22: మండల పరిధిలోని కొత్తపల్లె గ్రామ పంచాయతీలో భూసేకరణ అక్రమాల ఫిర్యాదుపై స్థానిక తహసీల్దారు కార్యా లయంలో గురువారం విచారణ మొదలైంది. భూసేకరణలో భారీస్థాయిలో అక్రమాలు జరిగాయని హ్యూమన్‌రైట్స్‌ కౌన్సిల్‌ జిల్లా అధ్యక్షుడు కరుణాకర్‌ రెవెన్యూ మంత్రికి, జిల్లా కలెక్టర్‌కు చేసిన ఫిర్యాదుపై కలెక్టర్‌ ఆదేశాల మేరకు కలెక్టర్‌ కార్యాలయ భూసేకరణ విభాగపు తహసీల్దారు వెంకటరమణ విచారణ చేశారు. కొత్తపల్లె వీఆర్వో మునిస్వామి, ఆర్‌ఐ సుదర్శన్‌, డిప్యూటీ తహసీల్దారు మనోహర్‌రెడ్డిని విచారించి సర్వేనంబరు 213లో 3.40 ఎకరాలు, సర్వేనంబరు 217లో 5.46 ఎకరాలు భూమి కొండపల్లి పార్వతమ్మకు, సర్వేనంబరు 223/3లో 2.90 ఎకరాలు, సర్వే నంబరు 111లో 82 సెంట్లు భూమి వారికి  ఎలా వచ్చిందన్న అంశంపై  విచారించారు. కొండపల్లి పార్వతమ్మకు సంబందించిన వీలునామాకు సంబందించి సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీసు నుంచి అధికారిక పత్రాలు, తెప్పించాలని డిప్యూటీ తహసీల్దారును విచారణ అధికారి ఆదేశించారు. మే 29వ తేదీన వేంపల్లె రాంభూపాల్‌రెడ్డి పేరుతో కలెక్టర్‌కు భూసేకరణ పరి హారంకోసం గెజిట్‌ పంపిన తర్వాత అదే వ్యక్తి పేరుతో అవే సర్వే నంబర్లు జూన్‌ 20వ తేదీన మళ్లీ ఎందుకు రిజిస్టర్‌ చేయించుకోవాల్సి వచ్చిందని విచా రణ అధికారి ప్రశ్నించారు. గెజిట్‌లో నమోదైన కొండపల్లి పార్వతమ్మ వేంపల్లె రాంభూపాల్‌రెడ్డిలకు సంబందించి పూర్తిస్థాయిలో ఆధారాలను సమర్పించాలని  అధికారులను అదేశించారు. ఈ సందర్భంగా విచారణ అధికారి వెంకటరమణ మాట్లాడుతూ విచారణ నివేదికను కలెక్టర్‌కు సమర్పిస్తానన్నారు. 

Updated Date - 2020-10-23T11:46:08+05:30 IST